కరోనా కట్టడికి రాష్ట్రంలో ఆంక్షలు పెడదాం

 కరోనా కట్టడికి రాష్ట్రంలో ఆంక్షలు పెడదాం
  • టాకీసుల్లో సీటింగ్​ కెపాసిటీ 50 శాతానికి పరిమితం చేయాలి
  •     బార్లను బంద్​ పెట్టాలి.. హోటళ్లు, రెస్టారెంట్లలో సోషల్​ డిస్టెన్స్​ మస్ట్​
  •     రాత్రి పది తర్వాత జన సంచారాన్ని తగ్గించాలి
  •     సీఎస్​తో సమావేశంలో ప్రస్తావించిన హెల్త్​ ఆఫీసర్లు!


 కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధించాల్సిందేనని హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అభిప్రాయపడుతోంది. కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నందున ఇప్పుడున్న చర్యలు చాలవని భావిస్తోంది. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్, కర్ఫ్యూ వంటివి కాకపోయినా జనాలు గుమిగూడకుండా ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందంటోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ హెల్త్ ఆఫీసర్లతో గురువారం సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమావేశమయ్యారు. కరోనా కట్టడి కోసం ఈ భేటీలో హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కొన్ని చర్యలు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇందులో ముఖ్యంగా సినిమా థియేటర్లలో సీటింగ్ కెపాసిటీని 50 శాతానికి తగ్గించడం, కేవలం వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపులను కొనసాగిస్తూ బార్లను బంద్ పెట్టడం, హోటళ్లు, రెస్టారెంట్లలో సోషల్ డిస్టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పనిసరిగా అమలయ్యేలా చూడటం వంటివి ఉన్నట్టు సమాచారం. అలాగే, రాత్రి 10 గంటల తర్వాత జన సంచారాన్ని తగ్గించేలా చర్యలు ఉంటే బాగుంటుందని మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఫీసర్లు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఈ ఆంక్షలతో వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేగాన్ని నియంత్రిస్తే, హాస్పిటళ్లలో పేషెంట్ల లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గుతుందని అంటున్నారు. అన్నీ ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఒకేసారి వేల సంఖ్యలో కేసులు వచ్చి, హెల్త్ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొంటున్నారు. ఇప్పటికే బెడ్లు దొరక్కపోవడం, రెమ్డెసివిర్​ వంటి కీలక మందుల కొరత వంటి అంశాల్ని ఆఫీసర్లు ప్రస్తావిస్తున్నారు. వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేగాన్ని తగ్గించగలితే, ఈ సమస్యలన్నీ వాటంతట అవే పరిష్కారం అవుతాయంటున్నారు.