లైన్‌‌‌‌మన్ కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి

లైన్‌‌‌‌మన్ కుటుంబానికి రూ.కోటి బీమా  చెక్కు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్​(ఎన్పీడీసీఎల్) పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందిన లైన్‌‌‌‌మన్ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ కుటుంబానికి రూ.కోటి ప్రమాద బీమా చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. బాసర ప్రాంతంలో లైన్‌‌‌‌మన్‌‌‌‌గా పనిచేస్తున్న ప్రమోద్ కుమార్ 2025 మార్చి 24న డ్యూటీలో ఉండగా ప్రమాదానికి గురై మృతిచెందారు. 

ఆయనకు యూనియన్ బ్యాంక్‌‌‌‌లో శాలరీ అకౌంట్​ ఉండగా, ప్రభుత్వం–బ్యాంకు మధ్య గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రమాద బీమా వర్తించింది. దీంతో మృతుడి నామినీ అయిన ఆయన భార్య స్వప్న పేరిట రూ.కోటి బీమా చెక్కును బ్యాంకు అధికారులు సిద్ధం చేశారు. ప్రజాభవన్‌‌‌‌లో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ చెక్కును స్వప్నకు అందజేశారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి, యూనియన్ బ్యాంక్ సీఈవో ఆశిష్ పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమరేష్ ప్రసాద్, చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.