దొరల ప్రభుత్వం కాదు..ప్రజల ప్రభుత్వం: భట్టి విక్రమార్క

దొరల ప్రభుత్వం కాదు..ప్రజల ప్రభుత్వం: భట్టి విక్రమార్క

కాంగ్రెస్ ప్రభుత్వం దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అబ్దుల్లాపూర్ మెట్ లో  ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. ఈ ప్రభుత్వం ప్రజలకు అంకితమన్నారు.  రాష్ట్ర ప్రజలందరికి పథకాలు అందిస్తామన్నారు. ప్రజల దగ్గరికే వెళ్లి అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు.  

పదేళ్లుగా తెలంగాణ  ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి..  ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.   కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే బాగుండని బీఆర్ఎస్ చూస్తుందన్నారు.  పార్టీలకతీతంగా ప్రభుత్వం పథకాలు అందిస్తామన్నారు.  గత ప్రభుత్వం మాదిరి బెదిరింపులు ఉండబోవన్నారు.  రాజకీయ పార్టీలకతీతంగా పథకాలు అందిస్తామన్నారు.  రాష్ట్ర బిడ్డలైతే చాలు అప్లై చేసుకోవచ్చన్నారు.  పేదలకు ఇచ్చిన భూములను గత ప్రభుత్వం లాక్కుందన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి జనవరి 6 వరకు  ప్రజా పాలన కార్యక్రమం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల కోసం గ్రామసభల్లో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ప్రతీ 100 అప్లికేషన్లకు ఒక్క కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రజలు అప్లికేషన్ల కోసం క్యూ కడుతున్నారు.