
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. ఎల్లుండి జరగనున్న జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రధాన వేదిక... సభా ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..తుక్కుగూడ బహిరంగ సభలో జాతీయ మేనిఫెస్టో ఉంటుందని తెలిపారు. ఇందులో దేశ దశ, దిశను నిర్ణయించే హామీలుంటాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తాము తుక్కుగూడ నుంచే ఆరు గ్యారెంటీలు ప్రకటించామని చెప్పారు భట్టి విక్రమార్క. ఇచ్చిన గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన గంటలోనే ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తుక్కుగూడ సభను విజయవంతం చేయాలని భట్టి కోరారు.