రాష్ట్ర భవిష్యత్తును మార్చే సదస్సు : డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్ర భవిష్యత్తును మార్చే సదస్సు :  డిప్యూటీ సీఎం భట్టి
  • రేపు మధ్యాహ్నం 1.30 గంట‌‌‌‌ల‌‌‌‌కు గ‌‌‌‌వ‌‌‌‌ర్నర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం: డిప్యూటీ సీఎం భట్టి 
  • 9న సాయంత్రం6 గంట‌‌‌‌ల‌‌‌‌కు ముగింపు
  • మొదటిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం ప్రసంగం
  • 44 దేశాల నుంచి 154 మంది ప్రపంచస్థాయి డెలిగేట్స్
  • ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు
  • ఇది పొలిటికల్​సమిట్‌‌‌‌ కాదు.. ఎకనామిక్‌‌‌‌ సమిట్‌‌‌‌ అని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు:  భారత్‌‌‌‌ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ సిటీలో ఈ నెల 8,9వ తేదీల్లో నిర్వహించబోయే 2025 గ్లోబల్​ సమిట్​రాష్ట్ర భవిష్యత్తును మార్చివేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇది పొలిటికల్​ సమిట్‌‌‌‌ కాదని.. ఇది ఎకనామిక్‌‌‌‌ సమిట్​అని పేర్కొన్నారు. శనివారం ప్రజా భవన్‌‌‌‌లో మంత్రులు శ్రీధర్​బాబు, అజారుద్దీన్‌‌‌‌తో కలిసి గ్లోబల్‌‌‌‌ సమిట్‌‌‌‌ వివరాలను భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు. 

2047 నాటికి  3 ట్రిలియన్​ డాలర్ల ఎకానమీ సాధనే లక్ష్యంగా రెండు రోజులపాటు  గ్లోబల్​ సమిట్​ నిర్వహించబోతున్నామని తెలిపారు. నీతి ఆయోగ్​ ఆఫీసర్లు, ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​ (ఐఎస్‌‌‌‌బీ) స్టూడెంట్స్​ సంయుక్తంగా ఈ సమిట్‌‌‌‌కు సంబంధించిన అంశాలపై విజన్​ డాక్యుమెంట్​ రూపొందించారని వివరించారు. రెండు రోజులపాటు జరిగే సెషన్లలో ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంట్​ అంశాలను వెల్లడిస్తామని చెప్పారు. అంత‌‌‌‌ర్జాయస్థాయిలో పేరొందిన ఎక‌‌‌‌నమిస్టులు ఇందులో ప్రసంగిస్తారని తెలిపారు.  

గవర్నర్ ​చేతుల మీదుగా ప్రారంభం

గ్లోబల్‌‌‌‌ సమిట్‌‌‌‌ను సోమవారం  మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ ప్రారంభిస్తారని  భట్టి విక్రమార్క తెలిపారు. మొదటి రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రసంగం ఉంటుందని, ఆ తర్వాత తనతోపాటు ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలు అభిజిత్​ బెనర్జీ, ట్రంప్​ మీడియా అండ్​ టెక్నాలజీస్ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, నోబెల్​ అవా ర్డు గ్రహీత కైలాశ్‌‌‌‌​ సత్యర్థి, కిరణ్​ మజుందార్​, కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు ప్రసంగిస్తారని చెప్పారు. 

ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి వివిధ డిపార్ట్‌‌‌‌ మెంట్లకు సంబంధించిన సెషన్స్​ ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి సెషన్‌‌‌‌లో ఆ సెషన్‌‌‌‌కు సంబంధించిన మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ, సెషన్​ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ పాల్గొంటారని వివరించారు. రెండో రోజు కూడా సెషన్స్​ కొనసాగుతాయని చెప్పారు. 9న సాయంత్రం ముగింపు కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.

6 ఖండాలనుంచి ప్రపంచస్థాయి డెలిగేట్స్..

గ్లోబల్‌‌‌‌ సమిట్‌‌‌‌లో పాల్గొనడానికి 6 ఖండాలు, 44  దేశాల నుంచి 154 మంది ప్రపంచస్థాయి డెలిగేట్స్​ హాజరవుతున్నట్టు భట్టి  వెల్లడించారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొనబో తున్నారని తెలిపారు. అప్పటి వరకు ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్​ సమస్య ఉంటే హెలికాప్టర్లలో  ప్రతినిధులను ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.  

అవసరమైతే ఎంఓయూలు: మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు 

ఇన్వెస్టర్లు రాష్ట్రానికి రావాల‌‌‌‌న్న సదుద్దేశంతోనే ఈ సమిట్​ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి శ్రీధర్​బాబు తెలి పారు. రైజింగ్​ సమిట్​ నచ్చి ఏదైనా కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైతే వెంటనే ఎంఓయూ ఒప్పందాలు చేసుకుంటామని తెలిపారు.  

నాలుగు హాల్స్​.. 27 సెషన్స్​..

తెలంగాణ రైజింగ్​ సమిట్​ –2025 కార్యక్రమానికి సంబంధించి రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు హాల్స్​ ఏర్పాటు చేసింది. తక్కువ సమయం ఉండటం వల్ల ఒకే సమయంలో నాలుగు సెషన్స్​ నిర్వహించుకునేలా ఈ ఏర్పాట్లు చేశారు. ఒక్కో హాల్‌‌‌‌లో ఒక్కో సెషన్​ చొప్పున మొత్తం రెండు రోజుల్లో 27 సెషన్స్​ నిర్వ హించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. 
    

  • మొదటి రోజు (సోమవారం) మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ‘పవరింగ్​ తెలంగాణ ఫ్యూచర్’​, ‘జీరో ఎమిషన్​ వెహికిల్స్​’, ‘సెమీకండక్టర్స్​ ఫ్రం టైర్​ టెక్నాలజీ’, ‘తెలంగాణ ఈస్​ ఏ గ్లోబల్​ ఎడ్యుకేషన్ హబ్’ సెషన్స్​ జరుగుతాయి. 
  • సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు ‘ది రైజ్‌‌‌‌​ ఆఫ్​ ఏరోస్పేస్​ అండ్​ డిఫెన్స్’​, ‘టాలెంట్​ మొబిలిటీ’, ‘హెల్త్‌‌‌‌కేర్​ ఆఫ్​ ఆల్​’, ‘కొరియా’, ‘ఆస్ట్రేలియా’ సెషన్స్​ నిర్వహిస్తారు.
  • రాత్రి 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ‘తెలంగాణ పార్ట్‌‌‌‌నరింగ్​ విత్​ ఏసియన్​ టైగర్స్’​, ‘గిగ్​ ఎకానమీ’, ‘ఇన్‌‌‌‌క్రీజింగ్‌‌‌‌ ఫార్మర్స్​ ఇన్‌‌‌‌కం థ్రూ వాల్యూ చైన్స్’​, కెనడా సెషన్​, ‘ఫాస్టరింగ్​ ఎంటర్​ప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌షిప్​ ఇన్​ విమెన్’​ సెషన్స్​ జరుగతాయి. రాత్రి 7 గంటల తర్వాత గాలా డిన్నర్​ ఏర్పాట్లు ఉంటాయి
  • రెండో రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచే సెషన్స్​ మొదలవుతాయి. 10 గంటల నుంచి 11.30 గంటల వరకు ‘యాక్సలరేటింగ్​​ఇన్నోవేషన్​ ఇన్​ లైఫ్​ సైన్సెస్’​, ‘తెలంగాణ ఒలింపిక్​ గోల్డ్‌‌‌‌ క్వెస్ట్’​, ‘హెరిటేజ్, కల్చర్​ అండ్​ ఫ్యూచర్​ రెడీ టూరిజం’, ‘లీవరేజింగ్​ క్యాపిటల్​ ప్రొడక్టివిటీ’, ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ‘ప్రాస్పెక్ట్​ ఇన్​ అఫర్డబుల్​  హౌజింగ్​ సెక్టార్’​, ‘మూసీ రెజువనేషన్​ అండ్​ బ్లూ గ్రీన్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఇన్​ హైదరాబాద్’, ‘ఇంటిగ్రేటెడ్​ ట్రాన్స్‌‌‌‌పోర్ట్​ అండ్​ అర్బన్​ రూరల్​ కనెక్టివిటీ’, స్టాండ్​ బై సెషన్స్​ ఉంటాయి. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 2.15 గంటల వరకు లంచ్​ సెషన్​ ఉంటుంది. 
  • మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 3.45 గంటల వరకు ‘భారత్​ ఫ్యూచర్​ సిటీ యాస్‌‌‌‌ ఏ  మ్యాగ్నెట్​ ఫర్​ 3 ట్రిలియన్​ ఎకానమీ ఇన్​ తెలంగాణ’, ‘ఈస్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​ 2.0’, ‘గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్స్’​,‘ ఇన్నోవేటిస్​ పీపీపీస్​ ప్రైవేట్​ క్యాపిటల్​ టువర్డ్స్​ పబ్లిక్​ గూడ్స్’పై సెషన్స్‌‌‌‌ నిర్వహిస్తారు.   సాయంత్రం 4  గంటల నుంచి 5.30 గంటల వరకు ‘ఇండియాస్​ సాఫ్ట్​ పవర్​ అండ్​ ది ఫ్యూచర్​ ఆఫ్​ ఎంటర్​టైన్‌‌‌‌మెంట్‌‌‌‌’, ‘ఎక్స్​పాండింగ్​ అపర్చునిటీ ఫర్​ ఎవ్రీవన్’, ‘క్యాపిటల్​ అండ్​ గ్రోత్’, ‘స్టార్ట్​ ఆఫ్‌‌‌‌​ ఎకో సిస్టమ్’​ సెషన్స్​ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ‘తెలంగా ణ రైజింగ్​ –2047’ విజన్​ డాక్యుమెంట్​ విడుదల చేస్తారు. రాత్రి 7 గంటలకు డ్రోన్​ షో, 7.30 గంటలకు డిన్నర్..​ ఆ తర్వాత కల్చరల్​ ప్రోగ్రామ్స్​​ ఉంటాయి.