
బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావు నోటీసులకు భయపడేది లేదని కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. నోటీసులు అందిన తరువాత ఏవిధంగా సమాధానం చెప్పాలో తనకు తెలుసన్నారు. రామచందర్ రావుకి దళితులన్నా బడుగు బహీన వర్గాలన్నా చిన్న చూపని విమర్శించారు భట్టి.
అసలేం జరిగిందంటే.?
రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడానికి రామచందర్ రావు కూడా కారణమంటూ ఇటీవల భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రివార్డుగా బీజేపీ అధిష్టానం ఆయనకు తెలంగాణ చీఫ్ పదవి ఇచ్చిందని ఆరోపించారు. రామచందర్ రావుకు తెలంగాణ చీప్ పదవి ఇవ్వడంపై బీజేపీ అధిష్టానం ఒకసారి పునరాలోచించాలన్నారు భట్టి.
Also Read : జాతీయ స్థాయిలో కులగణన తెరపైకి రావడంలో తెలంగాణదే కీ రోల్
భట్టి వ్యాఖ్యలను తప్పుబట్టిన రామచందర్ రావు తన న్యాయవాదితో లీగల్ నోటీసులు పంపించారు. మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేకపోతే రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని రామచందర్ రావు నోటీసుల్లో హెచ్చరించారు. దీనిపై క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచించారు. లేటెస్ట్ గా రామచందర్ రావు నోటీసులపై స్పందించిన భట్టి తాము నోటీసులకు భయపడేది లేదని చెప్పారు. నోటీసులిస్తే ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసన్నారు.