
మధిర, వెలుగు: ట్రాక్టర్ ప్రమాద ఘటనలో మృతి చెందిన వ్యవసాయ కూలీ యార్లగడ్డ వరమ్మ కుటుంబాన్ని ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. మృతురాలి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఖమ్మం జిల్లా బోనకల్ సమీపంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
డిప్యూటీ సీఎం వెంట ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.