వైసీపీకి షాక్: కాంగ్రెస్ లోకి డిప్యూటీ సీఎం మేనల్లుడు

వైసీపీకి షాక్: కాంగ్రెస్ లోకి డిప్యూటీ సీఎం మేనల్లుడు

2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు ప్రచారం కూడా మొదలు పెట్టడంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ఇదిలా ఉండగా అన్ని పార్టీలకు అసమ్మతి సెగ కూడా గట్టిగానే తగులుతోంది. ముఖ్యంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల జగన్ ఓట్ బ్యాంక్ ని టార్గెట్ చేసిన నేపథ్యంలో వైసీపీ నుండి కాంగ్రెస్ లోకి వలసలు ఎక్కువయ్యాయి. ఇటీవలే పలువురు వైసీపీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మేనల్లుడు రమేష్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరాడు.

గత కొంత కాలంగా నారాయణ స్వామికి అసమ్మతి వర్గంగా మారిన రమేష్ కాంగ్రెస్ తరఫున గంగాధర నెల్లూరు నుండి పోటీ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రమేష్ జగన్ సర్కార్ ఎస్సీలకు అన్యాయం చేసినందునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. డిప్యూటీ సీఎం వల్ల నియోజకవర్గంలో ఎస్సీలకు అన్యాయం జరిగిందని, గంగాధర నెల్లూరు నుండి పోటీ చేస్తానని, ప్రచారం కూడా చేసుకొమ్మని షర్మిల చెప్పారని అన్నాడు రమేష్. మరి, రమేష్ కాంగ్రెస్ లో చేరటం గంగాధర నెల్లూరులో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.