అబద్దాలు, కుట్రలు చేసే చంద్రబాబు మన ప్రత్యర్థి : సీఎం జగన్

 అబద్దాలు, కుట్రలు  చేసే  చంద్రబాబు మన ప్రత్యర్థి :  సీఎం జగన్

నమ్మంచి నట్టేట ముంచడంలో చంద్రబాబుకు 45  ఏళ్ల అనుభవం ఉందని ఏపీ సీఎం జగన్ విమర్శించారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.అబద్దాలు చెప్పేవారు, కుట్రలు చేసేవారు మనకు ప్రత్యర్థులుగా ఉన్నారని చెప్పారు. కూటమంతా ఏకమై, ఒకే ఒక్క జగన్ మీద పోటీకి వస్తుందన్నారు.  

చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ సరిపోవన్నట్టుగా తనపై బురద జల్లేందుకు  తన  ఇద్దరు చెల్లమ్మలను కూడా  తనపై యుద్దానికి  తీసుకువచ్చుకున్నారన్నారు. విలువలులేని ఈ రాజకీయాలు ఎవరి స్ఫూర్తిదాయకం అని జగన్ ప్రశ్నించారు.  మాజీ మంత్రి వైఎస్ వివేకాను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆ దేవుడికి, జిల్లా ప్రజలకు తెలుసన్నారు  జగన్.  వివేకాను అతిదారుణంగా చంపి బహిరంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారని.. ఆ  హంతకుడికి మద్దతిస్తూ కొందరు ప్రజల్లో తిరుగుతున్నారని  అన్నారు.  

Also Read: హైదరాబాద్‌లో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ముంబై

ప్రజల అకౌంట్లో 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా వేశమన్నారు జగన్.   భావితరాల కోసం విప్లవాత్మక మార్పు తీసుకవచ్చామని తెలిపారు.  మే13న ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేసి వైసీపీని రెండోసారి గెలిపించాలని ప్రజలకు సూచించారు.  58 నెలల్లో అధికారాన్ని ఒక బాధ్యతగా  నిర్వర్తిచామన్నారు సీఎం జగన్.  మేనిఫెస్టోను ఒక పవిత్రగ్రంధంగా భావించామని తెలిపారు.   ఎన్నికలు అయిపోగానే టీడీపీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తుందని విమర్శించారు.