
నవీపేట్, వెలుగు : సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని వైద్య సిబ్బందికి డిప్యూటీ డీఎంహెచ్వో సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో ని హాస్పిటల్ ను పరిశీలించారు. హాజరు రిజిస్ట్రర్, పేషెంట్స్ కు ఇస్తున్న ట్రీట్మెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వైద్య సేవలు ఎలా అందుతున్నాయంటూ రోగులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలన్నారు. దవాఖాన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై ఎప్పటికప్పుడు జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి నివేదిక పంపాలన్నారు. ఆమె వెంట డాక్టర్ ప్రవళిక, డెంటిస్ట్ శశిధర్, రత్నకుమారి, సూపర్ వైజర్స్ కిషన్ ఉన్నారు.