ఉప సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలి : రాణి కుముది

ఉప సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలి : రాణి కుముది
  •     రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రాణి కుముదిని ఆదేశం

 హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు జరపకుండా మిగిలిపోయిన ఉప సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల(డీపీవో)ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణి కుముదిని ఆదే శించారు. 18 జిల్లాల్లో 90 చోట్ల ఉప సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికలు పూర్తిచేయాలని సూచించారు. సం బంధిత డీపీవోలు లేదా ఆ అధికారి ప్రతినిధి ఆయా గ్రామ పంచాయతీల్లో శనివారం  ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నిక పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశం తేదీ, సమయం గురించి ముందు గానే సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, గ్రామ పంచాయతీ సభ్యులకు తెలియజేయాలన్నారు.

అలాగే, ఇటీవల మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వార్డు సభ్యులతో ఈ నెల 22న (సోమవారం) ప్రమాణ స్వీకారం జరిపించి, మొదటి సమావేశాన్ని నిర్వహించాలని పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రామీణా భివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన శుక్రవారం గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేశారు. ఆ రోజుకల్లా మిగిలిపోయిన ఉప సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఎన్నిక కూడా పూర్తిచే సి, అందరితో 22న ప్రమాణస్వీకారం చేయించే లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22న ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి అయిదేండ్ల పాటు సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వార్డుసభ్యులు తమ పదవుల్లో కొనసాగనున్నారు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.