
జూబ్లీహిల్స్‌లో అర్థరాత్రి మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డారు. ఇంటి తలుపులు తీసి లోపలికి వెళ్లాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అతడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే చొరబడ్డ వ్యక్తి మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ.. డ్యూటీ విషయంపై వచ్చానని డిప్యూటీ తహసీల్దార్ స్పష్టం చేశారు.