
విమల్ సంచులు గురించి మనకు తెలుసుకదా.. ఇప్పుడవి సోషల్ మీడియాలో ప్లాట్ ఫాం X లో బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకో తెలిస్తే మారు షాక్ అవ్వాల్సిందే..100 రూపాయల కంటే తక్కువ విలువ చేసే ‘విమల్’ సాధారణ వస్త్ర సంచి విదేశాలలో 4వేలకు కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతోంది. ముఖ్యంగా అమెరికాలో. విమల్ గుడ్డ సంచి ప్రాడక్టులను "స్టైలిష్ బ్యాగ్" పేరుతో సేల్ చేస్తున్నారు. నెట్టింట విమల్ బ్యాకులు ఎందుకు వైరల్ అవుతున్నాయి.. వాటి వెనక ఉన్న కథేంటో వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని ఫేమస్ లగ్జరీ డిపార్టుమెంట్ స్టోర్ అయిన నార్డ్ స్ట్రోమ్ లో విమల్ గుడ్డసంచులను(క్లాత్ బ్యాగులు) ఇండియన్ సావనీర్ బ్యాగ్ గా 48 డాలర్లు అంటే దాదాపు 4వేల 230 రూపాయల సేల్ ప్రైజ్ ను జత చేసింది. భారతీయులు ఇంటి అనుభూతికోసం ఈ బ్యాగులను కొనుగోలు చేసేలా ఆకర్షిస్తోంది. జపనీస్ కంపెనీ ప్యూబ్కో ద్వారా రీబ్రాండ్ చేయబడిన ఈ బ్యాగ్.. నార్డ్‌స్ట్రోమ్ సైట్‌లో అమ్మకానికి పెట్టారు.దీనికి క్యాప్షన్ గా భారతీయ సంస్కృతిని ఇష్టపడే ప్రతి ప్రయాణికుడు ఈ బ్యాగ్ ను కొనుగోలు చేయొచ్చు. మీతో భారతదేశంలోని ఓ భాగాన్ని తీసుకెళ్లండి అంటూ లిస్టింగ్ చేశారు.
అయితే ఈ విషయం తెలిసిన అమెరికాలోని భారతీయులు నిజంగా అంత ధర పెట్టి కొంటారా.. ఇదే ప్రశ్న నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
నార్డ్ స్ట్రోమ్ వెబ్‌సైట్‌లోని ఫోటోలలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని ఓ దుకాణం "రమేష్ స్పెషల్ నమ్‌కీన్" అని బోల్డ్ దేవనాగరి టెక్స్ట్ ఉన్న బ్యాగులు ,మరొకటి "చేతక్ స్వీట్స్" ఉన్న బ్యాగులు కూడా కనిపించాయి.
నెటిజన్ల స్పందన..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ధరల పెరుగుదలపై చాలా మంది స్పందించారు. 'వర్డిటా' అనే యూజర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ అయింది. లిస్టింగ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ఆమె ఇలా రాసింది..
‘‘ఇదో పెద్ద స్కామ్ లా ఉంది.. కేవలం ఒక సంచిని ప్రీమియం డిపార్ట్‌మెంట్ స్టోర్ నార్డ్‌స్ట్రోమ్‌లో $48కి అమ్ముతున్నారు. నేను ఇంటిని తలుచుకునే వ్యక్తినేకానీ.. నేను ఇంత ధరలు పెట్టికొనే స్టేజ్ కి నేను చేరుకోలేదు అని పోస్ట్ షేర్ చేసింది. వర్డిటా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మన దగ్గర 40 రూపాయలకు దొరికే బ్యాగులు.. అమెరికాలో 4వేలకు అమ్ముతారా’’ అని నెటిజన్లు మండిపడ్డారు.