
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటుంటారు..ఉల్లిగడ్డ లేనిదే ఏ వంటకం ఉండదు.. దాదాపు అన్ని కూరల్లో ఉల్లిగడ్డ వేస్తారు. ఉల్లి వాడకం రుచికి రుచి.. ఆరోగ్యం కూడా లభిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. దశాబ్దాలుగా ఆయుర్వేదంలో కూడా ఉల్లి కీలకం. అటువంటి ఉల్లిగడ్డలు రెండు రకాలు ఉన్నాయి. ఎరుపు ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డ.. వీటిలో ఏది రుచిగా ఉంటుంది.. ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చాలామంది డౌట్ పడుతుంటారు. నిజానికి తెల్ల ఉల్లిగడ్డ, ఎర్ర ఉల్లిగడ్డలో ఏదీ బెటర్..?
ఉల్లిపాయలు రుచి మాత్రమే కాదు.. అవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ ఎనర్జీ పుష్కలంగా ఉంటుంది. అయితే చాలామందిలో ఒకటే సందేహం.. ఎర్ర ఉల్లిగడ్డ మంచిదా.. తెల్ల ఉల్లి గడ్డ మంచిదా? అని..ఎర్ర ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు, పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే దేశీ ఉల్లిపాయలు శరీరాన్ని సహజంగా వ్యర్థాలను తొలగించడంతో సాయపడతాయి.రెండింటిలోనూ ఉత్తమమైన ఆరోగ్యాన్ని అందించే లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఏదీ ఎంతుందో తెలుసుకుందాం.
ఆర్థరైటిస్, గుండె జబ్బులు , డయాబెటిస్వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు వాపు ప్రధాన కారణం. వాపును తగ్గించే ఆహారం వాపును నయం చేయడానికి యథాస్థితికి చేర్చడానికి సాయపడతాయి. ముఖ్యంగా క్వెర్సెటిన్ ,సల్ఫర్ ఉత్పన్నాల వంటి సమ్మేళనాలతో సమృద్ధిగా ఉన్న ఉల్లిగడ్డలు ఆ ఆహారాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఉత్పన్నమయ్యే డౌట్ ఏంటంటే.. ఎర్ర ఉల్లిగడ్డ లేక తెల్ల ఉల్లిగడ్డ ఏది మంచి ఫలితాలనిస్తుంది అని.
ఎర్ర ఉల్లిపాయలు..చిన్నవి కానీ శక్తివంతమైనవి
ఎర్ర ఉల్లిగడ్డల్లో ప్రకాశవంతమైన రంగు ఆంథోసైనిన్ల నుంచి వస్తుంది. ఇవి బలమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ ఎనర్జీని కలిగి ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్న సమ వర్ణ ద్రవ్యం. ఇది ఎర్ర ఉల్లిగడ్డంలో ఉంటుందికాబట్టి వాపుతో పోరాడే విషయంలో ఎర్ర ఉల్లిగడ్డ బెటర్. అంతేకాదు..వాటిలో క్వెర్సెటిన్ అనే శక్తివంతమైన పదార్ధం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎర్ర ఉల్లిగడ్డలోని క్వెర్సెటిన్ గుండె జబ్బులు, అలెర్జీ ,కొన్ని జీర్ణశయాంతర సమస్యలను తగ్గిస్తుంది. ఎర్ర ఉల్లిపాయలను తరచుగా పచ్చిగా, సలాడ్‌లు, చట్నీలు లేదా శాండ్‌విచ్‌లలో తింటారు. దీంతో ఈ పోషకాలను పుష్కలంగా లభిస్తాయి.
తెల్ల(దేశీ) ఉల్లిగడ్డలు..తేలికైన ఆహారం.. ప్రభావం ఎక్కువే
దేశీ (తెలుపు లేదా పసుపు) ఉల్లిపాయలను కూడా తక్కువ అంచనా వేయకూడదు. అవి అంత రంగురంగులవి కాకపోవచ్చు..కానీ అవి ఇప్పటికీ ఆరోగ్య లక్షణాలతో నిండి ఉన్నాయి. ఈ ఉల్లిగడ్డల్లో ఎక్కువగా సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. అవి ఆ ఘాటైన వాసన ,కంటి దురదకు కారణమవుతాయి, అవి సహజ నిర్విషీకరణ అంటే వ్యర్థాలను సహజంగా శరీరంగా బయటికి పంపిస్తాయి. కాలేయం,జీర్ణవ్యవస్థ విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.అంతేకాదు దేశీ ఉల్లిపాయలు రుచికరంగా ఉంటాయి. రోజువారీ వంటకు సరైనవి.
►ALSO READ | జపాన్ పిల్లలే నంబర్ వన్..!! ఇక్కడి పేరెంట్స్ పిల్లలు ఆనందంగా ఉండేందుకు ఏం చేస్తున్నారో చూసారా..
సలాడ్లు, చట్నీలు, గార్నిష్ పదార్థాల కోసం ఎర్ర ఉల్లిపాయలు..కూరలు, పప్పులు ,ఫ్రైస్ కోసం దేశీ ఉల్లిపాయలు ఉపయోగిస్తే మీ శరీరానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ,రోగనిరోధక శక్తిని పెంచే సమ్మేళనాల సమతుల్య మిశ్రమాన్ని అందిస్తాయి.