
ఏ తల్లిదండ్రులకైనా కావలసింది ఒక్కటే... తమ పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం. వారు తీసుకునే ఆహారం విషయం దగ్గర నుంచి ఆడుకునే ఆటల వరకు.. ప్రతిదాంట్లోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. అవునా..! అయితే ఇటీవల కొందరు నిపుణులు చేసిన అధ్యయనంలో.... ప్రపంచంలోకెల్ల జపాన్లోని పిల్లలే అందరికన్న ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటున్నారని తేలిందట. మరి పొరపాటు ఎక్కడుంది. జపాన్ తల్లిదండ్రులు తమ పిల్లలను ఆనందంగా ఉండేందుకు ఏం చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం....
• పిల్లలు ఎప్పుడూ ఒకేలా తినడానికి ఇష్టపడరు. రోజూ ఒకే రకమైన ఫుడ్ తో బోర్గా ఫీలయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే జపాన్ తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫుడ్ పెడతారట. దాంతో పిల్లలు మారాం చేయకుండా వాటిని టేస్ట్ చేస్తారు. ఆ ఆహారం ఆరోగ్యకరమైనదే అయ్యుండేలా కూడా చూస్తారు వాళ్లు.
• అలాగే పిల్లలకు ఇష్టం లేని ఫుడ్ ని వాళ్లు అస్సలు బలవంతంగా తినిపించరు. అలాగే పిల్లలు వాళ్లంతట వాళ్లు ఎలా తిన్నా ఏమీ అనరట. ఇక్కడిలా కుడిచేత్తోనే తినాలి, అలా తినాలి, ఇలా తినాలి అని కండీషన్లు పెట్టరు. వాళ్లకి నచ్చినట్టుగా తిననిస్తారు.
• జపానీలు తమ పిల్లలకు భోజనాన్ని చిన్నచిన్న ప్లేట్లలోనే సర్వ్ చేస్తారట. అలా చేసినప్పుడు, పిల్లలు పుడ్ చూసి వెంటనే భయపడకుండా... కొద్దిగేగా అనుకుంటూ తింటారు. లేదంటే పెద్ద ప్లేట్లను చూసి, ఇప్పుడింత తినాలా అని భయపడి మొత్తానికే తినడం మానేస్తారు.
ALSO READ : Zoho మెయిల్‌కి అన్ని Gmail ఈమెయిల్స్ ను..
• పిల్లలను కిచెన్లోకి తీసుకెళ్లడం, వంట చేయడంలో కొద్దికొద్దిగా పాల్గొనేలా చేస్తే కూడా వాళ్లకి తిండిపై ఆసక్తి పెరుగుతుందని జపానీలు నమ్ముతారు. అంతేకాకుండా కుటుంబమంతా కలిసి తినడం, అప్పుడు పిల్లలు కూడా వాళ్లతో కూర్చోవడం లాంటివి చేస్తే కూడా మంచి ఆహారపు అలవాట్లు అలవడతాయట.
• జపాన్ వాసులు ఎక్కువగా సైక్లింగ్ ఇష్టపడతారు. అలాగే బ్రిస్క్ వాక్ కూడా బాగా చేస్తుంటారు. అయితే వాళ్లతో పాటు పిల్లలను కూడా బయటికి తీసుకెళ్తారు. అలా చేయడం వల్ల వాళ్ల ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుందట. ఎప్పుడూ వీడియో గేమ్స్ లాంటివి ఆడే పిల్లల కంటే వాకింగ్, అవుట్ డోర్ గేమ్స్ ఆడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.