ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. డిజిటల్ క్లాక్ తయారు చేసి రూ.5 లక్షలు గెలుచుకునే ఛాన్స్

ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. డిజిటల్ క్లాక్ తయారు చేసి రూ.5 లక్షలు గెలుచుకునే ఛాన్స్

తెలివిగా, క్రియేటివ్ గా ఆలోచిస్తూ.. టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వాళ్లకు ఇండియన్ రైల్వే అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఆసక్తి ఉన్నవాళ్లు పాల్గొనవచ్చునని దేశ వ్యాప్తంగా ఓపెన్ కాంపిటీషన్ ప్రకటించింది. ఈ కాంపిటీషన్ లో గెలిచిన వారికి అదిరిపోయే రివార్డు కూడా ప్రకటించింది. 

స్టేషన్లను డిజిటలీకరిస్తు్న్న రైల్వే శాఖ..  అన్ని రైల్వే ప్లాట్ ఫామ్ లలో, స్టేషన్లలో డిజిటల్ క్లాక్ లను అమర్చాలని నిర్ణయించింది. అందుకోసం ఒక క్రియేటివిటీ ఉపయోగించి అద్భుతమైన డిజిటల్ గడియారాలను తయారు చేసిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

డిజిటల్ క్లాక్ తయారు చేసే బాధ్యతను ఏదైనా కంపెనీకి ఇవ్వకుండా ఓపెన్ కాంపిటీషన్ ప్రకటించింది రైల్వే. ఈ పోటీల్లో పాల్గొనే వారిని మూడు కేటగిరీలుగా నిర్ణయించింది. ప్రొఫెషనల్స్, కాలేజ్/యూనివర్సిటీ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ అనే మూడు కేటగిరీలను ప్రకటించింది. 

అందరూ తయారు చేసిన క్లాక్ ల నుంచి బెస్ట్ డిజిటల్ క్లాక్ ను సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన క్లాక్ ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో ఉపయోగిస్తారు. బెస్ట్ క్లాక్ తయారు చేసిన వారికి రూ.5 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. దీనితో పాటు మూడు కేటగిరీలలో ప్రతి కేటగిరీ నుంచి 5 కన్సోలేషన్ ప్రైజులు కూడా ఇవ్వనున్నారు. ఒక్కొక్కరికి 50 వేల రూపాయల కన్సోలేషన్ ప్రైజ్ అందిస్తారు. కాంపిటీషన్ లో పాల్గొనే వారు ఆన్ లైన్ లో ఎంట్రీ చేసుకునేందుకు చివరి తేదీ మే 31. 

నిబంధనలు:

  • కొత్తగా తయారు చేసే డిజిటల్ క్లాక్ ఎలాంటి వాటర్ మార్క్ లేకుండా ఉండాలి.
  • హై రిజొల్యుషన్ లో ఉండాలి
  • క్లాక్ ఒరిజినల్ అని సర్టిఫికేట్ ఇవ్వాలి.
  • ఒక్కరు ఎన్ని డిజైన్లు అయినా ఇవ్వవచ్చు
  • ప్రతి డిజైన్  కు దాని థీమ్, కాన్సెప్ట్ ను వివరించేలా నోట్ జతచేయాలి
  • అన్నీ ఒరిజినల్ అయి ఉండాలి
  • ఎలాంటి కాపీరైట్స్ కు పాల్పడరాదు.

ఎంట్రీస్ ఈ కింది మెయిల్ అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది. 
contest.pr@rb.railnet.gov.in.

ఇప్పటి వరకు ఉన్న స్టేషన్లలో కాకుండా.. కొత్తగా 1300 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను నిర్మిస్తోంది రైల్వే శాఖ. ఈ కొత్త స్టేషన్లలో కొత్త డిజిటల్ క్లాక్ ను వినియోగించనున్నారు.