మోదీ ఆయుష్మాన్ కార్డు ఉన్నా.. రూ.9 లక్షల ఆస్పత్రి బిల్లు

మోదీ ఆయుష్మాన్ కార్డు ఉన్నా.. రూ.9 లక్షల ఆస్పత్రి బిల్లు

గుజరాత్​ లోని ఓ ఆస్పత్రికి  ప్రభుత్వం 45 లక్షల రూపాయిలు జరిమానా విధించింది.   ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డు ఉన్నప్పటికి ఓ కుటుంబం నుంచి  రూ 9 లక్షలు  డిమాండ్​ చేసింది.  అహ్మదాబాద్‌లోని గురుకుల్‌లో ఉన్న స్టెర్లింగ్ ఆసుపత్రి యాజమాన్యం పీఎంజేఏవై కార్డు ఉన్నప్పటికి  వైద్యం చేయడానికి నిరాకరించింది.   బాధితులు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో వైద్యం చేయలేదు.  దీంతో రోగి మృతి చెందడంతో... కుటుంబ సభ్యులు జిల్లా వైద్య అధికారులకు ఫిర్యాదు చేశారు. 

అహ్మదాబాద్​ నివాసి  జశ్వంత్ నాయక్ భార్య రంజనా నాయక్‌కు గుండెపోటు రావడంతో అత్యవసర చికిత్స కోసం స్టెర్లింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.  పీఎంజేఏవై కార్డు ఉన్నా.. వైద్యం కోసం డబ్బలు డిమాండ్​ చేసింది ఆస్పత్రి యాజమాన్యం.  నగదు డిపాజిట్​ చేయకపోతే రోగిని వేరే ఆస్పత్రికి తరలించాలని సూచించింది.  పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు నగదును ఆస్పత్రికి జమ చేశారు. 

గతేడాది సెప్టెంబర్​ 23 న తన భార్యకు గుండెపోటు రావడంతో స్టెర్లింగ్ ఆస్పత్రికి తరలించినట్లు జస్వంత్​ నాయక్​ తెలిపాడు. పేషెంట్​  PMJAY  కింద చికిత్స అర్హత ఉన్నప్పటికి ఆస్పత్రి వారు డబ్బులు అడిగడంతో చెల్లించారు. ట్రీట్​మెంట్​ ప్రారంభించినప్పడు మళ్లీ  డబ్బులు అడగడంతో.. డబ్బులు చెల్లించేందుకు ఆలస్యం కావడంతో ... చికిత్స ఆపేశారని ఆరోపించాడర.  చివరికి తన భార్య అక్టోబర్​ 1న మరణించింది.  ఆ తరువాత కూడా చికిత్స కు రూ. 9 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి వారు పేషెంట్​ కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చారు. 

బాధితులు ఈ విషయాన్ని అహ్మదాబాద్ జిల్లా ఆరోగ్య అధికారికి ఫిర్యాదు చేశారు. ఓ కమిటి వేసి ఈ విషయంపై ఆరా తీయగా ఆస్పత్రి నిర్వాకం బయటపడింది.  PMJAY  మార్గదర్శకాలను ఆస్పత్రి పాటించలేదని తేలింది.  దీంతో మృతుడి కుటుంబానికి  ఏడు రోజుల్లోగా రూ. 9 లక్షలు.. జరిమానా కింద ప్రభుత్వానికి రూ. 45 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ  చేసింది.