డిమాండ్​ ఉన్నా ఇండ్లు లేవు.. 81 వేల నుంచి 69 వేలకు పతనం

డిమాండ్​ ఉన్నా ఇండ్లు లేవు.. 81 వేల నుంచి 69 వేలకు పతనం

న్యూఢిల్లీ: అధిక డిమాండ్ ఉన్నప్పటికీ ఎనిమిది ప్రధాన నగరాల్లో జనవరి–-మార్చిలో రెసిడెన్షియల్​ ప్రాపర్టీల కొత్త సరఫరా 15 శాతం తగ్గి 69,143 యూనిట్లకు చేరుకుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌‌‌‌‌‌‌‌మన్ అండ్​ వేక్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ శుక్రవారం ఎనిమిది ప్రధాన నగరాల్లోని రెసిడెన్షియల్​ ప్రాపర్టీల లాంచ్‌‌‌‌‌‌‌‌ల డేటాను విడుదల చేసింది. బెంగళూరు, ముంబైలలో కొత్త సరఫరా పెరిగింది కానీ ఢిల్లీ–ఎన్సీఆర్​, చెన్నై, హైదరాబాద్, పూణె, కోల్‌‌‌‌‌‌‌‌కతా  అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లలో తగ్గింది. ఈ త్రైమాసికంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీల మొత్తం లాంచ్‌‌‌‌‌‌‌‌లలో హై-ఎండ్,  లగ్జరీ సెగ్మెంట్ 34 శాతం వాటాను దక్కించుకుంది. పెద్ద డెవలపర్ల వాటా ప్రస్తుత త్రైమాసికంలో మొత్తం లాంచ్‌‌‌‌‌‌‌‌లలో 38 శాతానికి పైగా ఉంది.

హౌసింగ్ ప్రాపర్టీల తాజా సరఫరా 2024 జనవరి–-మార్చి మధ్య కాలంలో 81,167 యూనిట్ల నుంచి 69,143 యూనిట్లకు తగ్గింది.  బెంగళూరులో కొత్త సరఫరా 7,777 యూనిట్ల నుంచి 8,848 యూనిట్లకు పెరిగింది.ముంబై ప్రాంతంలో కొత్త సరఫరా 19,063 యూనిట్ల నుంచి 19,461 యూనిట్లకు స్వల్పంగా పెరిగింది. అయితే, అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇండ్ల తాజా సరఫరా 4,901 యూనిట్ల నుంచి 4,529 యూనిట్లకు పడిపోయింది. చెన్నైలో లాంచ్‌‌‌‌‌‌‌‌లు 8,144 యూనిట్ల నుంచి 5,490 యూనిట్లకు పడిపోయాయి. ఢిల్లీ–-ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌లో కొత్త సరఫరా 7,813 యూనిట్ల నుంచి 3,614 యూనిట్లకు పడిపోయింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 14,371 యూనిట్ల నుంచి 11,090 యూనిట్లకు క్షీణించగా, కోల్‌‌‌‌‌‌‌‌కతాలో 5,292 యూనిట్ల నుంచి 4,753 యూనిట్లకు పడిపోయింది. పూణేలో హౌజింగ్​ ప్రాపర్టీల కొత్త సరఫరా ఈ ఏడాది జనవరి-–మార్చిలో 11,358 యూనిట్లు ఉండగా, గత సంవత్సరం ఇదే కాలంలో 13,806 యూనిట్లు అమ్మకానికి వచ్చాయి.