వందేభారత్ కార్యక్రమంలో RSS పాట ఎందుకు?..సెక్యులరిజాన్ని దెబ్బతీస్తున్నారు:కేరళ సీఎం విజయన్

వందేభారత్ కార్యక్రమంలో RSS పాట ఎందుకు?..సెక్యులరిజాన్ని దెబ్బతీస్తున్నారు:కేరళ సీఎం విజయన్

ఎర్నాకుళం-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా దక్షిణ రైల్వే విద్యార్థుల చేత RSS గణగీత్ పాడించడంపై కేరళ సీఎం పినరయి విజయ్​ తీవ్రంగా విమర్శించారు. ఈ చర్యను రాజ్యాంగ ఉల్లంఘనే.. సెక్యులరిజాన్ని దెబ్బతీయమే అన్నారు  విజయన్. ప్రభుత్వ కార్యక్రమాలలో మతపరమైన, రాజకీయ పరమైన జోక్యం ఉండకూడదని అన్నారు. 

శనివారం ( నవంబర్​8) ఎర్నాకుళం నుంచి బెంగళూరు వందే భారత్ సేవను ప్రారంభించిన అధికారిక కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో RSS పాటను చేర్చడం వివాదం గా మారింది. మత రాజకీయాలను ప్రోత్సహించే విధంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. ఇది ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు.. లైకిక వాదాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. రైల్వేలను ఓ సైద్ధాంతిక ప్రచారం కోసం వినియోగించడాన్ని తప్పుబట్టారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు తీవ్రమైన హిందూత్వ రాజకీయాలను జాతీయ వేడుకలో నింపడానికి ప్రయత్నించారని ఆరోపించారు.

మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవాలనే కేంద్రం నిర్ణయానికి ప్రతిస్పందనగా..విజయన్ సోషల్ మీడియాలో ఈ చర్యను విమర్శించారు.  తపాలా బిళ్ళ ,రూ. 100 నాణెం విడుదల చేయడం మన రాజ్యాంగానికి తీవ్ర అవమానం అని అన్నారు విజయన్.