వరద ప్రాంతాల్లో వరి పంట నాశనం: సీపీఎం నేత బీవీ రాఘవులు

వరద ప్రాంతాల్లో వరి పంట నాశనం: సీపీఎం నేత బీవీ రాఘవులు

భారీ వర్షాలు.. వరదలకు వరి పంట పూర్తిగా దెబ్బతినిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు.. వరదలతో ముంపు ప్రాంతాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నందున ప్రభుత్వం తక్షణమై అప్రమత్తమై నీటి పారుదల కాలువలపై పర్యవేక్షణ ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం కురుస్తున్న వర్షాలతో ప్రతి గ్రామంలో మూడు నుంచి ఐదు ఇల్లు కూలిపోయాయినట్లు సమాచారం వస్తోందని.. ఇల్లు కోల్పోయిన వాళ్లకు తక్షణమే పునరావాసం కల్పించాలని రాఘవులు డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్  ఇళ్ల ఆశతో … ఉన్న వాటిని బాగుచేసుకోలేకపోయామని బాధితులు వాపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలన్నింటిని పరిష్కరించి ఆదుకోవాలన్నారు.

ప్రతి కుటుంబానికి రూ.10 వేల నగదు ఇవ్వాలి: తమ్మినేని వీరభద్రం

భారీ వర్షాలు.. వరదలతో నష్టపోయిన బాధితులకు పరిహారంగా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కనీసం పది వేల రూపాయల నగదు.. 25 కిలోల బియ్యం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని స్వయంగా గవర్నరే వ్యాఖ్యానించారు.. వరద ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం కనిపిస్తోంది… అక్కడి ప్రజలకు పూర్తి  స్థాయిలో టెస్టులు చేయాలన్నారు. హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసిందని గుర్తు చేసిన ఆయన ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా పరీక్షలు పెంచాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడిని అరికట్టాలని.. భద్రాచలం పట్టణాభివృద్ధికి ప్రకటించిన వంద కోట్లు వెంటనే విడుదల చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు.