ముందుగానే వస్తున్న దేవ‌ర‌ .. రిలీజ్ డేట్ మారింది

  ముందుగానే వస్తున్న దేవ‌ర‌ ..  రిలీజ్ డేట్ మారింది

ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో  వస్తున్న దేవ‌ర‌ మూవీ రిలీజ్ డేట్ మారింది. తొలుత అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్ తాజాగా రెండు వారాలు ముందుగానే సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.  ఈమేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ విడుదల చేసింది.  

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ  సినిమా సెప్టెంబర్ 27వ తేదీ నుంచి వాయిదా పడటం దాదాపు ఖాయమవడంతో దేవర  మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ మూవీ తరువాత  ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న రెండో చిత్రమిది.   జాన్వీ కపూర్‌  హీరోయిన్ గా నటిస్తు్ంది.  ఇందులో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుద్ ర‌విచంద‌ర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు