దేవరకొండ మండలంలో గణేశ్ మండపం కాడ పడుకుంటే పాము కరిచింది

దేవరకొండ మండలంలో గణేశ్ మండపం కాడ పడుకుంటే పాము కరిచింది

దేవరకొండ,వెలుగు :  రాత్రి సమయంలో గణేశ్ మండపం దగ్గర పడుకున్న వ్యక్తిని పాము కరిచింది.  కుటుంబసభ్యుల వివరాల ప్రకారం..  దేవరకొండ మండలం ధర్మాతండాకు చెందిన మూడావత్​ శ్రీధర్(19)​ పట్టణంలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేశాడు.  బుధవారం రాత్రి తోటి మిత్రులతో కలిసి తండాలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద పడుకున్నాడు. తెల్లవారుజామున నొప్పిగా ఉందని స్నేహితులను లేపగా పాముకాటు వేసినట్లు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

Also Read :- పోలీస్ అలర్ట్ : గణేష్ నిమజ్జనం రోజు పాటించాల్సిన నిబంధనలు

వారు వెంటనే  దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్  ‌‌ ‌‌కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడు కబడ్డీ ప్లేయర్ కావడంతో క్రీడాకారులంతా సంతాపం తెలిపారు. శ్రీధర్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.