- ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ(చందంపేట), వెలుగు: గ్రామాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా మారుమూల గ్రామాల్లో నూతన సబ్‌స్టేషన్ లో ఏర్పాటు చేస్తున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. మంగళవారం చందంపేట మండల పరిధిలోని మానావత్ తండా గ్రామంలో రెండు కోట్ల మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. అంతకుముందు దేవరకొండ పట్టణంలోని సాయి శివ గార్డెన్ లో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 407 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పంపిణీ చేశారు.
దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జమున మాధవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మాజీ జడ్పీటీసీలు అరుణ సురేశ్ గౌడ్, బుజ్జి లచ్చిరాం నాయక్, మాజీ ఎంపీపీలు బిక్కు నాయక్, పవన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
