రూల్స్ పాటించ‌కుండానే దేవేగౌడ మనువ‌డి పెళ్లి

రూల్స్ పాటించ‌కుండానే దేవేగౌడ మనువ‌డి పెళ్లి

లాక్ డౌన్ క్ర‌మంలో ఎన్నో కార్య‌క్ర‌మాలు, మ్యారేజెస్ వాయిదాప‌డ్డ విష‌యం తెలిసిందే. కానీ కొంద‌రు వీటిని గాలికి వ‌దిలేస్తున్నారు. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నా మ్యారేజ్ గ్రాండ్ గా జ‌రిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కరోనా కల్లోలం మధ్యన బెంగళూరులో శుక్రవారం ఉదయం మాజీ ప్రధాని దేవేగౌడ మనుమడు, మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ మ్యారేజ్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందడిలో సోష‌ల్ డిస్టెన్స్ అనే రూల్, దాంతోపాటే ముఖానికి మాస్కులు కూడా వేసుకోలేదు బంధువులు. బెంగళూరుకు 28 కిలోమీటర్ల దూరంలోని బిదడీలోని ఓ ఫాంహౌస్ లో ఈ పెళ్లి జరిగింది.

పెద్దగా రిలేష‌న్స్ రాలేదట కానీ.. అన్ని సాంప్రదాయాలు పాటించారట. నటుడిగా జీవితం ప్రారంభించి రాజకీయాల్లోకి దూకిన నిఖిల్ ఓ కాంగ్రెస్ నేత మనుమరాలి మెడలో మూడుముళ్లు వేశారు. తాత 86 ఏళ్ల దేవేగౌడ అక్షింతలు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముందుగా బెంగళూరు నగరంలోనే పెళ్లి చేయాలని అనుకున్నారు. ఈలోగా కోవిడ్-19 మహమ్మారి వచ్చిపడింది. పెళ్లి వాయిదా వేసేందుకు కుమారస్వామి అంగీకరించలేదు. అందుకు బదులుగా వివాహవేదికను రెడ్ జోన్ అయిన బెంగళూరు నుంచి రామనగరకు మార్చారు. అక్కడున్న ఫ్యామిలీ ఫాంహౌస్ వివాహవేదిక అయింది. 60-70 మంది బంధువులు మాత్రమే హాజరైన‌ట్లు స‌మాచారం.

దీనిపై స్పందించారట‌ క‌ర్నాట‌క ఉప ముఖ్య‌మంత్రి అశ్వ‌త్థ నారాయ‌ణ‌. రూల్స్ బ్రేక్ చేసిన‌ట్లు తేలితే తప్పకుండా కుమారస్వామిపై చర్య తీసుకుంటామని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.