ఆర్యవైశ్యుల అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యం

ఆర్యవైశ్యుల అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యం
  •     వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడుఉప్పల శ్రీనివాస్ గుప్తా
  •     నాగోలులో ఆర్యవైశ్య ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం

హైదరాబాద్, వెలుగు :  ఆర్యవైశ్యుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్​ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. శుక్రవారం నాగోలులోని తన ఆఫీసులో భువనగిరి, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాల పరిధిలోని ఆర్యవైశ్య ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

దాదాపు 200 మంది ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​గుప్తా మాట్లాడుతూ..  తమ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ ఖాయమని చెప్పారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి,  మల్కాజిగిరిలో సునీతామహేందర్ రెడ్డి, చేవెళ్లలో గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించి, సీఎం రేవంత్​రెడ్డికి బహుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి

ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంకటేశంగుప్తా, సికింద్రాబాద్ జోన్ అధ్యక్షుడు వెల్దే రవికుమార్, నాయకులు చింతల రజినీకాంత్, పప్ప చంద్రశేఖర్, శ్రీనివాస్, నరేశ్​గుప్తా, మంజులారెడ్డి, మంజుల, ఉప్పల స్వప్న, మోహన్ రెడ్డి, చిరంజీవి, భిక్షపతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.