పెట్టుబడులతోనే అభివృద్ధి.. GSDPలో వాటాను 52 శాతానికి పెంచడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి

పెట్టుబడులతోనే అభివృద్ధి.. GSDPలో  వాటాను 52 శాతానికి పెంచడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి
  •  అప్పుడే 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యం
  • రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలూ ఆర్థికంగా ఎదుగుతరు
  • క్యూర్, ప్యూర్, రేర్ తో మారుమూల జిల్లాలు, ప్రాంతాలు డెవలప్
  • ఆరోగ్య రంగంపై చేసే ఖర్చును GSDP
  • పీలో 8 శాతానికి పెంచుతామని వెల్లడి
  • అసెంబ్లీలో 'తెలంగాణ రైజింగ్ -2047 డాక్యుమెంట్పై చర్చ

హైదరాబాద్. వెలుగు: రాష్ట్ర భవిష్యత్తుకు 'తెలంగాణ రైజింగ్ - 2047' డాక్యుమెంట్ దిశానిర్దేశం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 2047 నాటికి సహజంగానే 1.2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా రాష్ట్రం ఎదుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

కానీ రైతులు, దళితులు, గిరిజ నులు, మహిళలందరినీ అభివృద్ధి పథంలోకి తీసుకురావాలంటే అది సరిపోదు.. వాళ్లనూ అభివృద్ధిలోకి తీసుకురావాలంటే మనం పెట్టుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని చేరుకో వాలి. అందుకు తగ్గట్టుగా కొత్త విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది" అని పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో 'తెలంగాణ రైజింగ్-2047పై చర్చ సందర్భం గాభట్టి మాట్లాడారు.

పెట్టుబడులతోనే అభివృద్ధి

మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించేం దుకు కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, GSDP లో పెట్టుబడుల వాటాను 52 శాతానికి పెంచేలా టార్గెట్ పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఇందుకోసం మూలధనాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం కాదు.. మూలధనాన్ని మరింత పెంచుకునే రాష్ట్రంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. పొదుపు, విదేశీ పెట్టుబడులను పెంచుకోవడంతో పాటు తొలిసారి ఇన్నోవేటివ్ స్టార్టప్​ ల తోడ్పాటుకు ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

జిల్లాలకు అభివృద్ధి ఫలాలు అందట్లేదు.. 


రాష్ట్రంలో హైదరాబాద్​ వేగంగా అభివృద్ధి చెందినా,ఇంకా పలు జిల్లాలకు మాత్రం అభివృద్ధి ఫలాలు అందడం లేదని భట్టి అన్నారు. "తెలంగాణ రైజింగ్-20-47 డాక్యుమెంట్ ద్వారా జిల్లాలనూ అభివృద్ధి చేస్తాం. అందుకు అనుగుణంగా క్యూర్ (కోర్​అర్బన్​ రీజియన్ఎకానమీ), ప్యూర్ (ఫెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ), రేర్ (రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ)గా విభజించుకుని ముందుకెళ్తున్నాం.

 క్యూర్లో భాగంగా ఓఆర్ఆర్ లోపల నెట్​ జీరో  ఆధారిత మెగాసిటీ డెవలప్ చేస్తాం. అందులో 30 వేల ఎకరాల భారత్ ప్యూచర్ సిటీతోపాటు ఏఐసిటీ, హెల్త్ సిటీ వంటివి ఉంటాయి. ప్యూర్ లో భాగంగా ఓఆర్ ఆర్, ట్రిపుల్ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. ఈ రీజియన్లో ఫ్యాక్టరీలు, లాజిస్టిక్స్ హబ్, బ్లూ కాలర్ జాబ్స్ వంటి వాటినిప్రోత్సహిస్తాం. రేర్​ లో  భాగంగా రీజినల్ రింగ్ రోడ్ అవతల వ్యవసాయాన్ని అధిక విలువ కలిగిన బయో ఎకానమీగా వృద్ధి చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్, ఎకోటూరిజంపై దృష్టి సారిస్తాం" అని వివరించారు.

స్కిల్స్ ఉంటేనే జాబ్స్..

రాష్ట్రంలో చాలామంది యువతకు సరైన నైపుణ్యా లు లేవని, దీంతో ఉద్యోగాలు రావడం లేదని భట్టి అన్నారు. అందుకే యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి, జాబ్స్ వచ్చేలా చేసేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

"ఈ వర్సిటీలో జర్మన్ డ్యుయల్ సిస్టమ్ ఫాలో అవు తున్నాం. ఇందులో విద్యార్థులను కేవలం క్లాస్ రూమ్ లోనే ఉంచకుండా వారంలో ఒకట్రెండు రోజులు క్లాస్​రూమ్ ట్రైనింగ్. మూడు,నాలుగు రోజులు ఫీల్డ్ లో ట్రైనింగ్ ఇస్తాం. అలాగే ఆరోగ్య రంగంపై చేసే ఖర్చును GSDPలో 8 శాతానికి పెంచుతాం.

 ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమవుతుంది. అంతేకాకుండా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. స్వయంసహాయక సంఘాలను కార్పొరేట్ సంస్థలుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాం. కేవలం లోన్లు ఇవ్వడం వరకే పరిమితం కాలేదు. 


మహిళల వ్యక్తిగత క్రెడిట్ స్కోర్ను పెంచేలా చూస్తున్నాం. బంజారాహిల్సలోని వ్యాపారవేత్తలకు ఏవిధంగా పెట్టుబడులు సమ కూరుతున్నాయో.. మారుమూల గ్రామంలో ఉండే మహిళలకూ అలాగే పెట్టుబడులు ఇప్పించేలా కృషి చేస్తున్నాం" అనిచెప్పారు.