సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి : ఇన్చార్జి వినయ్రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి :  ఇన్చార్జి వినయ్రెడ్డి

 కాంగ్రెస్​ ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్​చార్జి వినయ్​రెడ్డి 


​ఆర్మూర్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్​రెడ్డి హయాంలోనే ఆర్మూర్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని  కాంగ్రెస్​ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు.

శుక్రవారం ఆర్మూర్​లోని రాంనగర్​ కాలనీలో క్షత్రియ మినీ ఫంక్షన్ హాల్  ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆర్మూర్ టౌన్​లో మంజూరైన నిధులతో గూండ్ల చెరువు , శ్మశాన వాటిక, రోడ్డు డివైడర్, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయన్నారు.

ఎస్​ఎస్​కే క్షత్రీయ మినీ ఫంక్షన్ హాల్ అభివృద్ధి కోసం రూ.10 లక్షల నిధులు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో క్షత్రీయ సమాజ్​ ప్రతినిధులు అల్జాపూర్​ శ్రీనివాస్, సమాజ్ అధ్యక్షుడు బచ్చేవాల్ రెడ్డి ప్రకాశ్, కార్యదర్శి బారడ్ గంగామోహన్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత, ఖాందేశ్​సంగీత శ్రీనివాస్, గంగామోహన్​ చక్రు, బారడ్ రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం12వ వార్డు కాశి హనుమాన్ వీధి కాలనీ మున్నూరు కాపు పంథా సంఘం సభ్యులు మాజీ కౌన్సిలర్ తాటి హన్మంతుతో కలిసి వినయ్​ రెడ్డిని కలిసి తమ సంఘం అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని కోరగా, ఆయన సానుకూలంగా  స్పందించారు.