తెలంగాణలో అభివృద్ధి పనులకు రూ. 3వేల747 కోట్లు రిలీజ్

తెలంగాణలో  అభివృద్ధి పనులకు రూ. 3వేల747 కోట్లు రిలీజ్

ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ నిమ్స్, ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.3,747.63 కోట్లు రిలీజ్ చేసినట్లు కేంద్రం పేర్కొన్నది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లోక్​సభలో అడిగిన ప్రశ్నకు  శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌‌ పవార్‌‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ హెల్త్‌‌ మిషన్‌‌ కోసం 2019–20 నుంచి 2022–23 వరకు రూ.3,045.66 కోట్లను తెలంగాణకు విడుదల చేసినట్లు తెలిపారు. పైరెండింటిలో కలిపి రూ.5,924.46 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. పీఎం స్వాస్త్య సురక్ష యోజన కింద బీబీనగర్‌‌ ఎయిమ్స్‌‌కు రూ.1,365.95 కోట్లు కేటాయించగా.. రూ.379.9 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపింది. ఆదిలాబాద్‌‌ రిమ్స్, వరంగల్‌‌ కాకతీయ మెడికల్‌‌ కాలేజీలకు రూ.150 కోట్ల చొప్పున కేంద్రం కేటాయించిందన్నారు. ఇందులో కేంద్ర వాటా రూ.120 కోట్లు, రాష్ట్ర వాటా రూ.30 కోట్లుగా ఉందన్నారు. కేంద్ర వాటా కింద ఆదిలాబాద్ రిమ్స్‌‌కు రూ.112 కోట్లు, కాకతీయ మెడికల్‌‌ కాలేజీకి రూ.116.04 కోట్లు ఇప్పటి వరకు రిలీజ్ చేశామన్నారు. హైదరాబాద్‌‌ నిమ్స్‌‌ ప్రాజెక్టుకు రూ.196.26 కోట్లు కేటాయించగా.. అందులో రూ.100 కోట్లు కేంద్ర వాటా, రూ.96.26 కోట్లు రాష్ట్ర వాటాగా ఉందన్నారు. కేంద్ర వాటా కింద రూ.94.93 కోట్లు విడుదల చేశామన్నారు.

మెడికల్ సీట్ల కౌన్సెలింగ్​లో కేంద్రీకృత విధానం లేదు
2023–24లో మెడికల్ సీట్ల కౌన్సెలింగ్​లో కేంద్రీకృత విధానం అవలంభించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సూఖ్ మాండవీయ శుక్రవారం సమాధానం ఇచ్చారు. అయితే సీట్లలో 15% ఆలిండియా కోటా ఉంటుందని చెప్పారు.