త్వరలో కేబినెట్ విస్తరణ చేపడతాం : దేవేంద్ర ఫడ్నవీస్

త్వరలో కేబినెట్ విస్తరణ చేపడతాం :  దేవేంద్ర ఫడ్నవీస్

త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్  తెలిపారు. ప్రస్తుతం కేబినెట్ లో సీఎం ఏక్‌నాథ్ షిండేతో సహా 18 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు. మహారాష్ట్రలో మంత్రి మండలిలో గరిష్టంగా 43 మంది సభ్యులు ఉండవచ్చు.  ప్రస్తుతం ఉన్న 18 మంది మంత్రులలో షిండే పార్టీ నుండి 9  మంది, బీజేపీ నుండి 9 మంది ఉన్నారు. 

ఉద్ధవ్ థాక్రే  నేతృత్వంలోని శివసేన పై తిరుగుబావుటా ఎగరవేసిన ఏక్‌నాథ్ షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 30న సీఎంగా క్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ  స్వీకారం చేయగా ఆగస్టు 9న తొలి మంత్రివర్గ విస్తరణ జరిగింది.