బీజేపీలోకి దేవేందర్​గౌడ్?

బీజేపీలోకి దేవేందర్​గౌడ్?
  • కొడుకు వీరేందర్‌‌‌‌ గౌడ్‌‌‌‌ సహా పార్టీలో చేరేందుకు సిద్ధం

హైదరాబాద్​, వెలుగు: టీడీపీ సీనియర్​ నేత దేవేందర్​గౌడ్​ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సోమవారమే ఆయన హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ఆయన నివాసంలో రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్​తో గంట పాటు భేటీ అయ్యారు. దేవేందర్​ గౌడ్​ కొడుకు వీరేందర్​ కూడా  బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. మంగవారమే ఢిల్లీ  చేరుకున్న ఆయన బుధవారం లేదంటే గురువారం బీజేపీ ముఖ్యనేతలను​ కలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఆయనతో పాటు మరి కొంత మంది బీసీ ముఖ్య నేతలు బీజేపీలో చేరతారని ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు సర్కార్​లో  దేవేందర్​గౌడ్​ కీలకమైన హోంశాఖ, రెవన్యూ శాఖల మంత్రిగా పనిచేశారు.