
పద్మారావునగర్/ముషీరాబాద్, వెలుగు: గ్రేటర్లోని ప్రధాన ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్సెక్రటరీ, కమిషనర్ శైలజా రామయ్యర్ జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. లోయర్ ట్యాంక్ బండ్పై వెలసిన కనకాల కట్ట మైసమ్మ అమ్మవారు తొలిరోజు బాలత్రిపురి సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బల్కంపేట ఎల్లమ్మను బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రామచంద్రరావు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర వేర్వేరుగా దర్శించుకున్నారు.