ఆల్మోస్ట్ కన్ఫర్మ్: ‘ఎల్లమ్మ’ కోసం మారుతున్న హీరోలు.. వేణు వేటలో పడిన క్రేజీ రాక్ స్టార్!!

ఆల్మోస్ట్ కన్ఫర్మ్: ‘ఎల్లమ్మ’ కోసం మారుతున్న హీరోలు.. వేణు వేటలో పడిన క్రేజీ రాక్ స్టార్!!

ప్రముఖ​ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని పదేళ్ల క్రితమే వార్తలొచ్చాయి.  ఇప్పుడు ఆ వార్త నిజం కాబోతోంది. త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు దేవిశ్రీ ప్రసాద్. ‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన వేణు యెల్దండి.. ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌‌తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా ద్వారా దేవిశ్రీ ప్రసాద్‌‌ హీరోగా పరిచయం కాబోతున్నట్టు తాజా సమాచారం. మొదట ఈ కథ కోసం నానిని సంప్రదించగా, ఇతర కమిట్‌మెంట్స్తో  కుదరలేదు.  ఆ తర్వాత నితిన్‌‌ పేరు దాదాపుగా ఖరారైంది. కానీ ‘తమ్ముడు’ చిత్రం నిరాశపరచడంతో నితిన్‌‌ ఈ ప్రాజెక్ట్‌‌ నుంచి వైదొలిగినట్టు తెలిసింది.

అనంతరం బెల్లంకొండ శ్రీనివాస్‌‌ పేరు కూడా వినిపించినప్పటికీ అది కేవలం ఊహాగానాలకే పరిమితమైంది. అప్పుడప్పుడు పలువురు తమిళ హీరోల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఫైనల్‌‌గా ఇప్పుడీ ప్రాజెక్ట్‌‌లోకి దేవిశ్రీ ప్రసాద్‌‌ వచ్చారు. నిజానికి పదేళ్ల క్రితం ‘కుమారి 21 ఎఫ్‌‌’ సినిమా ఈవెంట్‌‌లో దేవిశ్రీ ప్రసాద్‌‌ను తమ బ్యానర్‌‌‌‌ ద్వారానే హీరోగా లాంచ్‌‌ చేస్తానని సరదాగా చెప్పారు దిల్‌‌ రాజు. ఇప్పుడు ఆ మాట నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.