ప్రతి అమ్మాయికి దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది: రీతూ వర్మ

ప్రతి అమ్మాయికి దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది: రీతూ వర్మ

రీతూ వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి లీడ్ రోల్స్‌‌‌‌లో ‘శ్రీకారం’ ఫేమ్ బి.కిశోర్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘దేవిక అండ్ డానీ’. సుధాకర్ చాగంటి నిర్మించారు. జూన్ 6 నుంచి జియో హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో రీతూ వర్మ మాట్లాడుతూ.. ‘చాలామంది అమ్మాయిల‌‌‌‌కు చుట్టు ప‌‌‌‌క్కల ఉండేవాళ్లు నువ్వు ఇది చేయ‌‌‌‌లేవు అని చెప్పి నిరాశపరుస్తుంటారు. కానీ అలాంటివారికి ఈ సిరీస్ ఓ న‌‌‌‌మ్మకాన్ని క‌‌‌‌లిగిస్తుంది. డైరెక్టర్ కిశోర్ ఈ సిరీస్‌‌‌‌ను బాగా రూపొందించారు. 

డానీ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో సూర్య చాలా ఇన్వాల్వ్ అయ్యి నటించారు. అలాగే  సుబ్బుగా శివ కందుకూరి త‌‌‌‌న పాత్రలో ఒదిగిపోయారు. సుబ్బరాజు గారు, కోవై స‌‌‌‌ర‌‌‌‌ళ‌‌‌‌గారు స‌‌‌‌హా ఎంటైర్‌‌‌‌ టీమ్‌‌‌‌కు థ్యాంక్స్’ అని చెప్పింది. విలేజ్‌‌‌‌లో ఉండే అమ్మాయిలు బయటకు వెళితే ఎలా మారుతారనే విషయాన్ని ఇందులో బాగా చూపించారని నటుడు  సూర్య  వశిష్ట అన్నాడు.  ఇలాంటి  క్లీన్ సబ్జెక్ట్‌‌‌‌లో నటించడం సంతోషంగా ఉందని శివ కందుకూరి అన్నాడు. 

 డైరెక్టర్ బి.కిషోర్ మాట్లాడుతూ ‘‘శ్రీకారం’ త‌‌‌‌ర్వాత ఈ సిరీస్ చేయ‌‌‌‌టం చాలా ఆనందంగా ఉంది.  టీజ‌‌‌‌ర్‌‌‌‌, ట్రైల‌‌‌‌ర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  దీపక్ రాజ్ అనే రైట‌‌‌‌ర్ ద‌‌‌‌గ్గర నుంచి ఈ ప్రయాణం ప్రారంభ‌‌‌‌మైంది. టీమ్ అంతా  బాగా స‌‌‌‌పోర్ట్ చేశారు. ఈ సిరీస్ చూసే ఆడియెన్స్ స‌‌‌‌మ‌‌‌‌యం వృథా కాదు. ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.  ఏడు ఎపిసోడ్స్‌‌‌‌తో రాబోతున్న ఈ సిరీస్ అందర్నీ అలరించేలా ఉంటుందని నిర్మాత సుధాకర్ చాగంటి అన్నారు.