వినాశకాలే విపరీత బుద్ధి.. అనుమానాలు రేపుతున్న డెవిల్ దర్శకుడి పోస్ట్

వినాశకాలే విపరీత బుద్ధి.. అనుమానాలు రేపుతున్న డెవిల్ దర్శకుడి పోస్ట్

వినాశకాలే విపరీత బుద్ధి.. ఇది కళ్యాణ్ రామ్(Kalyan ram) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డెవిల్(Devil) దర్శకుడు నవీన్ మేడారం రీసెంట్ ఇన్స్టా పోస్ట్. ప్రస్తుతం ఈ పోస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం డెవిల్ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన అప్డేట్ పోస్టర్ లో దర్శకుడి పేరు లేకపోవడమే.

డెవిల్ సినిమాను నిర్మిస్తుంది అభిషేక్ పిక్చర్స్. ముందుగా ఈ సినిమాకు కథ, కథనం శ్రీకాంత్ విస్సా అని, డైరెక్షన్ నవీన్ మేడారం అని వేశారు మేకర్స్. ఆ తరువాత కథనం, డైరెక్షన్ నవీన్ మేడారం, కేవలం కథ మాత్రం శ్రీకాంత్ విస్సా అని వేశారు. ఇక తాజాగా రిలీజైన పోస్టర్ లో ఈ ఇద్దరి పేర్లు వేయకుండా ఏ ఫిల్మ్ బై అభిషేక్ పిక్చర్స్ అని వేశారు. దీంతో ఈ సినిమా నుండి దర్శకుడు నవీన్ మేడారం తప్పుకున్నాడు అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే తనకు తానుగా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడా? లేక కావాలనే అతనిని తప్పించారా అనే విషయం సస్పెన్స్ గానే ఉంది.

అయితే తాజాగా ఇదే విషయం స్పదించారు దర్శకుడు నవీన్ మేడారం. ఆయన ఇంస్టాగ్రామ్ లో వినాశకాలే విపరీత బుద్ధి అనే ఒకేఒక లైన్ ను పోస్ట్ చేశారు. దీంతో ఇది ఖచ్చితంగా డెవిల్ సినిమాను ఉద్దేశించే పెట్టారని, కావాలనే మేకర్స్ తనని ప్రాజెక్టు నుండి తీసేశారని, ఆ బాధతోనే నవీన్ ఈ పోస్ట్ పెట్టుంటాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి నిజంగా నవీన్ మేకర్స్ ను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారా అనేది తెలియాల్సి ఉంది.