డెవిల్ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

డెవిల్ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన  స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌. అభిషేక్ నామా దర్శకనిర్మాతగా రూపొందించిన ఈచిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. మంగళవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేశారు. ఇందులో బ్రిటీష్  సీక్రెట్ ఏజెంట్‌‌‌‌‌‌‌‌గా డిఫరెంట్ లుక్స్‌‌‌‌‌‌‌‌లో కనిపించాడు కళ్యాణ్​ రామ్. ‘శవాలు సాక్ష్యాలు చెప్పడం ఎక్కడైనా చూశారా.

విశ్వాసంగా  ఉండటానికి, విధేయతతో బ్రతికేయడానికి కుక్కను అనుకున్నావారా.. లయన్’ అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.  ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘మంచి కంటెంట్ ఉన్న స్టోరీ ‘డెవిల్’. విజువల్స్ ఎలా ఉంటాయనేది ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా చూశారు. ఇది ఏ ఒక్కరి కష్టం కాదు. ఇదొక టీమ్ ఎఫర్ట్.  నా మాట తీసుకోండి.. రాసుకోండి.. సినిమా చాలా బావుంటుంది.

ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. ‘బింబిసార2’ను సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదలుపెడతాం. అలాగే తమ్ముడు ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. త్వరలోనే గ్లింప్స్ రాబోతుంది. దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి’ అని చెప్పాడు. మంచి కథతో వస్తున్న ‘డెవిల్‌‌‌‌‌‌‌‌’ అందరికీ కొత్తగా అనిపిస్తుంది అని చెప్పింది సంయుక్త మీనన్.

‘నా ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేయడానికి దక్కిన అవకాశం ఇది’ అని చెప్పింది మాళవిక నాయర్. అభిషేక్ నామా మాట్లాడుతూ ‘ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ను నమ్మి రెండేళ్లు సినిమా కోసం వర్క్ చేశారు కళ్యాణ్ రామ్. ఇందులో ఆయన విశ్వరూపం చూస్తారు. ఇలాంటి పీరియాడిక్ మూవీ బాగా రావాలంటే మంచి టీమ్ ఉండాలి. అలాంటి టీమ్ మాకు కుదిరింది.  

‘వీర సింహారెడ్డి’ విజయంతో ప్రారంభమైన ఈ ఏడాది  ‘డెవిల్‌‌‌‌‌‌‌‌’ బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎండ్ అవుతుంది’ అని చెప్పారు.  మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్,  రైటర్ శ్రీకాంత్ విస్సా, డీవోపీ సౌందర్ రాజన్,  ఆర్ట్ డైరెక్టర్ గాంధీ, ఎడిటర్ తమ్మిరాజు, లిరిసిస్టులు శ్రీహర్ష, సత్య పాల్గొన్నారు.