కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

సరికొత్త కాన్సెప్టులు, డిఫరెంట్ మేకోవర్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘డెవిల్‌‌‌‌’. సంయుక్తా మీనన్ హీరోయిన్‌‌‌‌. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌‌‌‌గా కనిపించనున్నాడు. 

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. ఆదివారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. నవంబర్ 24న ఈ చిత్రాన్ని వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తెలుగు, హిందీ, త‌‌‌‌మిళ, క‌‌‌‌న్నడ భాష‌‌‌‌ల్లో రిలీజ్ కానుంది. 

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, మాటలు,  స్క్రీన్ ప్లే అందించాడు. హ‌‌‌‌ర్షవ‌‌‌‌ర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.