తల నీలాల కోసం రెండు గంటల నిరీక్షణ

తల నీలాల కోసం రెండు గంటల నిరీక్షణ

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రెండేళ్ల తర్వాత కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్లు బయటకు వచ్చాయి. అద్దె గదులు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తలనీలాల కోసం 2, 3 గంటల టైమ్ పడుతోంది. శ్రీవారి ఆలయం మొదలు అలిపిరి వరకు యాత్రికులతో  రద్దీ కనిపిస్తోంది.  ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు కరోనా కారణంగా రోజుకు 30 నుంచి 40 మందికి మాత్రమే టికెట్లు జారీ చేసింది టీటీడీ.  కరోనా ప్రభావం తగ్గడంతో మార్చి ఫస్ట్ వీక్ నుంచి 60 నుంచి 70 వేలకు పెంచారు. రద్దీ పెరగడంతో దర్శనం టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. దీంతో లేపాక్షి దగ్గర ఎంట్రీ పాయింట్  ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయం ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, గదులు కేటాయించే సీఆర్వో, కల్యాణకట్టలు, అన్నప్రసాద భవనం.. ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు.  భక్తుల రద్దీతో ఈ ఆదివారం వరకు స్పెషల్ దర్శనాలను రద్దీ చేసింది టీటీడీ. వెంకన్న దర్శనానికి 25 నుంచి 30 గంటల టైమ్ పడుతోంది. ఇక కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీరు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు టీటీడీ సిబ్బంది. 

మరోవైపు వాహనాలతో తిరుమల కొండ కిక్కిరిసిపోయింది.  తలనీలాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణకట్టలు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు లడ్డూకౌంటర్  కూడా భక్తుల రద్దీతో దర్శనమిస్తోంది. దర్శనం లభించకపోయినా కనీసం ప్రసాదమైనా తీసుకుందామని క్యూలైన్లలో బారులు తీరారు భక్తులు. షాపింగ్  ప్రాంతాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి.