
పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్త గూడెం జిల్లా పాల్వంచలోని కేపీ జగన్నాధపురం లో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయంలో శ్రావణమాసం ఆదివారాన్ని పురస్కరించుకొ ని పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారు జామునుంచే జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి తలనీలాలు, ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మ వారికి నైవేద్యం, పొంగళ్లు, బోనాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం లో అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, వాహన పూజలు నిర్వహించారు. భారీగా తరలివ చ్చిన భక్తులతో ఆలయ ప్రాంగ ణం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీ కుమారి, ధర్మ కర్తల మండలి అధ్యక్షుడు బాలినే ని నాగేశ్వరరావు, ధర్మకర్తలు చెవుగాని పాపారావు, చీకటి కార్తీక్, పెండ్లి రామిరెడ్డి, దుగ్గిరాల సు ధాకర్, చెరుకూరి శేఖర్ బాబు, అడుసుమిల్లి సాయిబాబా, సందుపట్ల రమ్య పాల్గొన్నారు.