
పాల్వంచ, వెలుగు : మండలంలోని కేపీ జగన్నాథపురంలో గల పెద్ద మ్మతల్లి దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి ఆదివారం కావడంతో పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో అన్నప్రాసనలు, వాహన పూజలు, తలనీలాలు, అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, కనుమలు సమర్పించారు.
ఆలయ పునర్ నిర్మాణానికి భక్తులు విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో రజిని కుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, సభ్యులు చెవుగాని పాపారావు, ధర్మరాజుల నాగేశ్వరరావు, సందుపట్ల రమ్య, చెరుకూరి శేఖర్ బాబు పాల్గొన్నారు.