
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తొలుత ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. అనంతరం తలనీలాల మొక్కు చెల్లించుకున్నారు. ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనం, కోడె మొక్కు క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ సోమవారం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం సాయంత్రం నుంచే భక్తులు వేములవాడకు చేరుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ రాధాబాయి, అధికారులు ఏర్పాట్లు చేశారు.