న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ప్రముఖ ఆలయాల్లో రద్దీ

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ప్రముఖ ఆలయాల్లో రద్దీ

హైదరాబాద్: కొత్త ఏడాది సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దర్శన, ప్రసాద క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కొండ పైకి వాహనాలను అధికారులు అనుమతించడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం క్యూ కట్టారు. మాస శివరాత్రి కూడా కావడంతో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అర్చకులు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించి.. స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. వరంగల్ లోని ప్రముఖ ఆలయాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నగరంలోని అన్ని ఆలయాల్లో రద్దీ కనిపిస్తోంది. వెయి స్థంబాలు, భద్రకాళి ఆలయంలో దర్శనం కోసం బారులు తీరారు భక్తులు. కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ సిటీలోని  ఆలయాల్లో కొత్త ఏడాది సంబురం కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి ముఖ ద్వారం నుంచి గర్భాలయం వరకు ప్రత్యేకంగా అలంకరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి ఈ రోజు బంగారు చీరును అలంకరించారు. దర్శనానికి 45 నిమిషాల సమయం పడుతోంది. కిలో మీటర్ మేర భక్తులు క్యూ కట్టారు.

మరిన్ని వార్తల కోసం: 

గోవింద నామస్మరణతో కొత్తేడాది వేడుకలు

దళితుల ఆత్మగౌరవ పోరాట విజయమే భీమా కోరేగావ్

వైష్ణో దేవి టెంపుల్‌ తొక్కిసలాట