తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల : తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వెలుపల క్యూలైన్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 30 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. తమిళులకు పెరటాశి మాసం కావడంతో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మరో మూడు రోజులపాటు ఇదే విధంగా రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.