నాన్న పులి కథలా.. అలిపిరి మార్గంలో భక్తుల భయం.. జింక పిల్లను చూసి బెంబేలు

నాన్న పులి కథలా.. అలిపిరి మార్గంలో భక్తుల భయం.. జింక పిల్లను చూసి బెంబేలు

నాన్న పులి కథ తెలుసుకదా.. నాన్న పులి అనగానే తండ్రి పరిగెత్తుకుని వస్తాడు.. ఇలా రెండు, మూడు సార్లు తండ్రిని ఆటపట్టిస్తాడు కొడుకు. తీరా చివరికి నిజంగా పులి వస్తుంది.. అప్పుడు ఆ తండ్రి నమ్మడు.. ప్రస్తుతం తిరుపతి – తిరుపల అలిపిరి మార్గంలో భక్తుల పరిస్థితి ఇలాగే ఉంది. అలిపిరి మెట్ల మార్గంలో పులి ఓ చిన్నారిని చంపిన ఘటన తర్వాత.. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కొండ ఎక్కుతున్నారు భక్తులు. గుంపులు గుంపులుగా భక్తులు ఏడు కొండలకు చేరుకుంటున్నారు. ఏడో మైలురాయి నుంచి నరసింహస్వామి ఆలయం మధ్య పులుల సంచారం ఉందని.. రెండు, మూడు పులులు తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు సైతం ప్రకటించటంతో.. భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ క్రమంలోనే.. ఆగస్ట్ 14వ తేదీ సోమవారం ఉదయం భక్తులు అలిపిరి మార్గంలో కొండ ఎక్కుతున్నారు. అయితే ఏడో మైలురాయి దాటిన తర్వాత.. మెట్ల మార్గానికి కొంత దూరంలో.. కళ్లకు కనిపించేంత దూరంలో.. ఓ జింక పిల్ల కనిపించింది. ఈ జింక పిల్లను చూసిన భక్తులు.. అది పులి అనుకుని.. పులి పిల్ల అని భావించి కేకలు వేస్తూ పరుగులు తీశారు భక్తులు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది విజిల్స్ వేస్తూ అటవిలోకి వెళ్లారు. అయితే అది పులి పిల్ల కాదని.. పులి కాదని.. జింక పిల్ల అని తేల్చారు. ఈ ప్రాంతంలో జింకల సంచారం ఉందని.. జింకలు ఎక్కువగానే ఉన్నాయని.. గతంలోనూ జింకలు తిరుగుతూ ఉంటాయని.. భక్తులకు కనిపిస్తూనే ఉంటాయని చెబుతున్నారు టీటీడీ అధికారులు.

 

ప్రస్తుతం పులి భయంతో ఉన్న భక్తులు.. జింక పిల్లను చూసి పులిగా భావించి.. పులిగా భయపడి భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం అలిపిరి మార్గంలో భక్తుల పరిస్థితి ఎలా ఉంది అంటే.. నాన్న పులి కథలా తయారైంది. జింక పిల్లను చూసి పులిగా భావించి భయపడుతున్నారు. గతంలో అయితే జింక పిల్లల దగ్గరకు సరదాగా వెళ్లేవారు.. ఇప్పుడు దూరంగా కనిపించే జింకలు, జింక పిల్లలు సైతం పులులుగా భ్రమపడి భయపడుతున్నారు. మొత్తానికి అది పులి కాదు జింక.. జింక పిల్ల​అని తేలటంతో.. ఊపిరిపీల్చుకుని.. ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా గోవిందా అంటూ మెట్లు ఎక్కుతున్నారు భక్తులు.