సుబ్బు, ప్రియాంక హీరో హీరోయిన్లుగా అఫ్సర్ ఆజార్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘దక్షిణ కాళీ’. హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కథను అందించి శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు సత్యవాణి మీసాల. దర్శకుడు తోట కృష్ణ డివోషనల్ కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడలో విడుదల కానుంది. ఈ చిత్రంలో మాంత్రికుడి పాత్రలో అఫ్సర్ ఆజాద్ కనిపించనున్నాడు. గతంలో బాలకృష్ణ కాంబినేషన్‌లో శ్రీమన్నారాయణ, అధినాయకుడు, ప్రభాస్‌తో చక్రం, అల్లరి నరేష్‌తో సీమ టపాకాయ్ వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపును అందుకున్నాడు. నటనకే పరిమితం కాకుండా పలు రకాలుగా పేదవారికి సహాయం చేయడానికి ‘ఆజాద్ ఫౌండేషన్’ను స్థాపించి సమాజ సేవ చేస్తున్నాడు అఫ్సర్ ఆజాద్. సోనూసూద్‌లా నటన పరంగా , సమాజ పరంగా బాధ్యతలు నిర్వహిస్తున్న అజాద్‌కు నటుడు శ్రీహరి అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయనలాగే మరెన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాలని ఉందని చెప్పాడు.
