ఆధ్యాత్మికం.. మనస్సు మాయ చేస్తుంది.. ఏది ఎంత వరకు నమ్మాలో తెలుసుకోండి..!

ఆధ్యాత్మికం.. మనస్సు మాయ చేస్తుంది.. ఏది ఎంత వరకు నమ్మాలో  తెలుసుకోండి..!

ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి గాబరా పడిపోతారు.. చిన్న సమస్యను కూడా బూతద్దంలో పెట్టి చూడటంతో మనస్సు కకావికలం అవుతుంది.  దేన్ని నిశితంగా ఆలోచించే ఓపిక ఇప్పటి జనాలకు అస్సలు లేదు... ప్రతి దానికి ఏదో జరిగిపోతుందని మనస్సు ఆలోచిస్తుంది.  కాని దేనిని ఎంత వరకు నమ్మాలి.. ఏ విషయాన్ని ఎలా రిసీవ్​ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .  ! 

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి కొన్ని నమ్మకాలు ఉంటాయి.  అవి ఆధ్యాత్మికం... కావచ్చు.. మూఢ నమ్మకాలు కావచ్చు.  వీటితో జనాలు సతమతమవుతున్నారు. ఇంట్లో 50 ఏళ్లు దాటిన వాళ్లు ఉంటే.. వారు అప్పటి వరకు చలాకీగా.. ఉత్సాహంగా పరుగులు పెడుతూ జీవనం కొనసాగిస్తారు.  ఒక రోజు వారికి ఏదో కొద్దిగా వెన్ను వస్తే ఇక వారితో భయం మొదలవుతుంది.  నేను నామనుమడి పెళ్లి చూడనేమో.. పిల్లలను ఆడించలేనేమో.. మంచానికే పరిమితమవ్వాల్సి వస్తుందోనని.. ఇలాంటి ఆలోచనలు మనస్సును వెంటాడుతాయి. 

మన నమ్మకాల వలలో మన మనస్సు పడి .. నేను 50 సంవత్సరాలు దాటేశాను... ఈ వయస్సులో  గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ... ఇది గుండె నొప్పేనా? అని  మనసులో సిలొగిజం ఆట మొదలవుతుంది. సహజంగా 50 ఏళ్లు దాటిన వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువుగా ఉంటుంది.  కాని ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా చిన్న.. పెద్ద అని తేడా లేకుండా అందరూ గుండె సమస్యలతో భాధపడుతున్నారనుకోండి.. అదివేరే విషయం.  

ఈ స్టోరీలో ఓ పెద్దాయనకు వచ్చిన వెన్ను నొప్పి గుండె నొప్పే అయి ఉండాలని ఆయన మనస్సులో తీవ్రంగా ఆలోచన మొదలవుతుంది.  కాని అప్పటి వరకు చలాకీగా.. ఉత్సాహంగా ఉన్నాను అనే విషయాన్ని మాత్రం ఆలోచించదు. ఈ ఆలోచనతోనే అతను మరింత భయపడిపోతాడు. భయంతో ఊపిరి బిగుసుకున్నట్లు అనిపిస్తుంది. 

కాని ఇదంతా మనస్సు చేస్తున్న ఆలోచన మాత్రమే.  ఇక తనకు ఏదో జరిగిపోతుందని కుటుంబసభ్యులకు చెపుతాడు.  వారు పెద్దాయన కా.. వయస్సు 50 దాటింది కదా.. అని ఆసుపత్రికి తీసుకెళతారు. అక్కడ వైద్యులు ECG, బీపీ, బ్లడ్ టెస్టులు అన్నీ చేసి.. . రిపోర్టులు చూసిన  డాక్టర్  ఇది కేవలం గ్యాస్ నొప్పి ఎలాంటి ఇబ్బంది లేదు  అని చెపుతాడు.  

నమ్మకం ఎలా ఏర్పడుతుంది?

 నిజంగా ఆ పెద్దాయనకు  గుండె సమస్య లేదు. కానీ 50 ఏళ్లు దాటినవారికి గుండె సమస్య వచ్చే అవకాశం ఉందనే నమ్మకం  ఆయన మనసులో భయాన్ని నాటాయి. ఆ భయం ఆయన్ని ఆసుపత్రి వరకు లాగింది. 

  • నల్ల పిల్లి నా దారి దాటింది. తప్పకుండా ఏదైనా అపశకునం జరుగబోతుంది
  • నిద్రపోతూ కాలు ఒక్కసారిగా లాగినట్లయింది... ఓహ్! నాకేదైనా చెడు శకునం తగిలిందా?
  • పొద్దున్నే ఇంటి ముందు పసుపు నిమ్మకాయలు పడేశారు. ఇది ఏమిటో!
  • నిద్రలో ఎవరో పేరు పిలిచినట్లు అనిపించింది. వాస్తవంగా ఎవరు పిలవలేదు... ఇలాంటి సంఘటనలు చెడు సంకేతమంటారు కదా?

 ఇలాంటి  నమ్మకాలు మన జీవితాన్ని  ప్రభావితం చేస్తాయి. మనం నమ్మిన ప్రతిదీ నిజం కాకపోవచ్చు. కానీ మనం నమ్మినట్లు మన మనస్సు స్పందించటం ప్రారంభిస్తుంది.

 పరిష్కారం ఏమిటి?

ఇలాంటి అపోహల నుంచి బయటపడటానికి ...థాట్ రీప్లేస్మెంట్... అనే మానసిక సాధన చాలా ఉపయోగకరం.ఒక ప్రతికూల ఆలోచన మన మెదడులో వేగంగా అల్లుకోవడం మొదలైతే, దానికి ప్రత్యామ్నాయంగా సానుకూల ఆలోచనను పెట్టుకోవాలి. పైన తెలిపిన విధంగా ఆ పెద్దాయన.. నా ఆరోగ్యం బాగుంది. నేను నిత్యం నడుచుకుంటా, ఆరోగ్యంగా ఉన్నా. ఇది కేవలం అలసట వల్ల వచ్చిన చిన్న నొప్పి మాత్రమే అని అనుకుంటే  అతని మానసిక స్థితిని మార్చేది. ఎక్కువమంది మానసిక భయాల వల్లే అనవసరమైన పరీక్షలు, ఆసుపత్రి ఖర్చులు, ఒత్తిడికి గురవుతున్నారు.

 నిజమైన మాయ ఇదే..!

మన ఆలోచనలే మనపై ప్రభావం చూపి మనలను మాయలోకి నెడతాయి. మీ చుట్టూ ఉండే సమాజం ఇచ్చే ..సజెషన్స్.. మిమ్మల్ని మానసిక ఊబిలోకి లాక్కెళ్తున్నాయనే విషయాన్ని గ్రహించాలి.  నిజంగా భయం ఉన్నదా, లేక మనం ఊహించుకున్నదా? ఆలోచించండి.  మీరు నమ్మే విధంగా మీ జీవితాన్ని మలుచుకోండి...మనస్సును మాయచేయనివ్వకండి! మీ నమ్మకమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందనే సత్యాన్ని గ్రహించండి..!

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.