ఆధ్యాత్మికం: దేవుడంటే ఎవరు? పూజ చేయకపోతే ఏమవుతుంది? భక్తిమాత్రమేనా.. సైంటిఫిక్ రీజన్ ఉందా..!

ఆధ్యాత్మికం: దేవుడంటే ఎవరు? పూజ చేయకపోతే ఏమవుతుంది? భక్తిమాత్రమేనా.. సైంటిఫిక్ రీజన్ ఉందా..!

పండగ వచ్చినా.. పబ్బం వచ్చినా.. ఏదైనా విశిష్టత కలిగిన రోజయినా..పుట్టిన రోజు.. పెళ్లి రోజైతే చాలు జనాలు గుడికి వెళ్లి దేవుడిని మొక్కుకుంటారు.. ఇంకా ప్రత్యేక పూజలు చేస్తారు.  అసలు దేవుడంటే ఎవరు.. ఎందుకు పూజచేయాలి... కేవలం ఆధ్యాత్మికత మాత్రమేనా.. సైంటిఫిక్​ రీజన్స్​ ఏమైనా ఉన్నాయా.. ఆరోగ్య పరంగా లాభాలొస్తాయా.. ఈ విషయంలో పెద్దలు ఏం చెబుతున్నారు.  దేవుడికి కొబ్బరికాయకు సంబంధం ఏమిటి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !

దేవుడంటే ఎవరు.. నిజంగా దేవుడు ఉన్నాడా.. లేడా.. ఎందుకు పూజ చేయాలి.. గుడికి ఎందుకు వెళ్లాలి.. ఇలాంటి ప్రశ్నలు  చిన్నపిల్లలే కాదు... చదువుకున్న పెద్దవాళ్లు కూడా అడుగుతున్నారు. ఇలా అడగడం  తెలియని తనం కాదు.. దేవుడంటే నమ్మకం లేకపోవడం కాదు..  అవిశ్వాసం కూడా కాదు... కేవలం  అవగాహన లోపం ఉండటం.. వారి అడిగిన ప్రశ్నలను నివృత్తి చేయలేకపోవడం.. వారికున్న అనుమానాల గురించి స్పష్టత ఇవ్వకుండా .. అలా మాట్లాడితే కళ్లు పోతాయి.. చెంపలేసుకో.. ఇక ఎప్పుడు అలా అనని దేవుడికి దండం పెట్టుకోమని చెబుతారు..  ఇలాంటి సమాధానమే దురదృష్టవశాత్తూ మన పెద్దలు చెబుతారు. ఇలా చెప్పేవారు వారి తెలియని తనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు   అజ్ఞానంతో భయపెట్టే మాట అని కొంతమంది ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

దేవుడు కళ్లుపోగొట్టే శాడిస్ట్ కాదు. .. ఇలా చెప్పడం వల్ల దేవుడిపై ద్వేషం, ధర్మంపై విరక్తి పెరుగుతుందే తప్ప భక్తి పెరగదు. కాబట్టి పిల్లలకైనా, పెద్దలకైనా భయంతో కాకుండా..  బుద్ధితో అర్థమయ్యేలా సమాధానం చెప్పాలి.

 దేవుడి పూజ అంటే ఏంటి?

దేవుడి పూజ అనేది చాదస్తం కాదు...   మూఢ నమ్మకం కాదు.. అంధ విశ్వాసం అంతకంటే కాదు.  మనసుతో చేసే యోగ ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నమాట.  మన మెదడు, మన శరీరం, మన ఆలోచనలను శాస్త్రీయంగా శుద్ధి చేసుకునే విధానంలో దేవుడి పూజ ఎంతో ఉపయోగపడుతుంది . మన పూర్వీకులు దేవుడు.. పూజ .. అనే మాటల్లో  శక్తి,  చైతన్యం, సామరస్యము అన్న భావాలను ఉంటాయనే విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. 

 దీప ప్రజ్వలనం .. ఏకాగ్రత పెరగడం..

నూనె దీపాన్ని రోజూ 2–3 నిమిషాలు తదేకంగా చూడటం వలన ఆరోగ్య పరంగా చాలా లాభాలున్నాయి.  కంటి జబ్బులు తగ్గుతాయి..  ఏకాగ్రత పెరుగుతుంది.. ఆలోచనలు స్థిరపడతాయి.. నిద్ర సమస్యలు తగ్గుతాయి.  ఇందుకే మన ఇళ్లలో, గుడుల్లో నూనె దీపం చాలా ముఖ్యమైందని పెద్దలు చెబుతుంటారు

 మంత్ర జపం – మెదడుకు వ్యాయామం

మంత్రం అంటే అర్థం తెలియకూడదు అనుకోవడం తప్పు. మంత్రం అంటే  అక్షరాల క్రమం,  లయ,  శ్వాసలను నియంత్రించే ప్రక్రియలో ఒక భాగం .. సాధారణంగా మంత్రాలను 11 సార్లు.. 108 సార్లు జపం చేయాలని చెబుతుంటారు.  ఇలా చేయడం వలన  నాలికతో వ్యాయామం చేయడం జరుతుగుంది.   ఉచ్చారణ స్పష్టత.. ధారణ శక్తి పెరుగుతుంది. మాట మీద పట్టు వస్తుంది .. ఇంకా స్టేజ్ ఫియర్ తగ్గుతుంది.. అందుకే వేద పాఠశాలల్లో పిల్లలు ధైర్యంగా మాట్లాడతారు.

 దేవాలయ పూజలోని శాస్త్రం

 మూలవిరాట్ ను  భూమిలో ఎలక్ట్రానిక్ + మాగ్నెటిక్ తరంగాలు కలిసే చోట మూలవిరాట్ ప్రతిష్ఠిస్తారు.
రాగి రేకులు వాటిని శోషించడంలో సహాయపడతాయి.

 ప్రదక్షిణ:  Clockwise దిశలో తిరగడం వల్ల  భూమి గమనానికి అనుకూలంగా శరీరం స్పందిస్తుంది శక్తి ప్రవాహం మనలోకి వస్తుంది. ఇది వేదిక్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందింది. పొద్దున్నే లేచి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయటం వల్ల నడక అలవాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఉదయం నడక అని పార్క్ లలో, రోడ్ ల మీద పరిగెడుతున్న ప్రక్రియనే ఆధ్యాత్మిక ప్రకారం  పొద్దున్నే లేచి దేవాలయములో మూడు సార్లు...  11 సార్లు ..  ఇంకా ఓపిక ఉంటే 108 సార్లు ప్రదక్షిణము చేయమంటారు. 

 ఆభరణాలతో దర్శనం : నగలు సంపద ప్రదర్శన కోసం కాదు. బంగారం, వెండి వంటి లోహాలు శక్తి తరంగాలను బాగా గ్రహిస్తాయి.

 కొబ్బరికాయను ఎందుకు కొట్టాలి..

 పై టెంక – అహంకారం.. లోపలి కొబ్బరి – శుద్ధమైన మనసు... నీళ్లు – ప్రేమ, కరుణ తియ్యదనానికి సూచిక అని చెబుతుంటారు. అహంకారం పగిలితే మనసు పవిత్రమవుతుంది అన్న సంకేతం. అందుకే అయ్యప్ప దీక్షల సమయములో కొబ్బరికాయ లోపలకు నూనె పోయిస్తారు, అది మనిషి ఒక్క ఏకాగ్రతకు చిహ్నంగా భావిస్తారు.  అందుకే దేవాలయంలో కొబ్బరికాయను కొడితే మనం సర్వస్వం వదలినట్టేనని భావించాలి.  

 మంత్రాలు & న్యూరాన్లు :  ఫోన్ నంబర్ గుర్తుంచుకోవడానికి పద్ధతి వాడినట్లే మంత్రాల్లో అక్షర క్రమం  మెదడులో న్యూరాన్లను ఉత్తేజితం చేస్తుంది , జ్ఞాపకశక్తిని పెంచుతుంది

 గర్భగుడి :  గర్భగుడి ద్వారం నేరుగా ఉంటే  శక్తి నేరుగా ..పక్కకు ఉంటే   శరీరానికి శక్తి అనుకూలంగా ఉంటుంది

 అభిషేకం :  పంచలోహ విగ్రహాలపై పాలు, తేనె, నీళ్లు భూమి తరంగాలతో కలిసి  ఔషధ గుణాన్ని పొందుతాయి. అభిషేక జలాన్ని సేవించటం ద్వారా చాలా రోగాలకు ఉపశమనం కలుగుతుంది. 

 హారతి : పచ్చ కర్పూరం ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. హారతి తీసుకునేటప్పుడు , వెచ్చదనం కళ్లకు తగిలేలా చేయాలి.  ఇది ఆయుర్వేదంలో స్వేదకర్మ. కర్పూర హారతిని సేవించడం  ద్వారా చాలా రోగాలకు ఉపశమనం కలుగుతుంది.  జలుబు చేస్తే చిన్న కర్పూర బిళ్ళను ఖర్చీప్ లో కట్టుకొని వాసవ చూడు ..జలుబు, దగ్గు పోతుంది అంటారు. విక్స్ ఇన్​ హేలర్ అదే కాన్సెప్ట్ తో వచ్చిన మోడర్న్ ప్రొడక్ట్.

 తీర్థం :  తులసి, లవంగం, కర్పూరం, పంచామృతం.. ఇవన్నీ   జీర్ణక్రియకు,  శరీర శుద్ధికి, మనసు ప్రశాంతతను చేకూరుస్తుంది.

 అసలు బాధ్యత ఎవరిది?

పిల్లలను భయపెట్టడం కాదు ...  మూడనమ్మకాలు నేర్పడం కాదు..  శాస్త్రీయంగా ధర్మాన్ని అర్థమయ్యేలా చెప్పడం  పెద్దల బాధ్యత. హిందూ ధర్మం అంటే  గుడ్డి నమ్మకం కాదు... భయం కాదు..  శాస్త్రం + ఆత్మజ్ఞానం అది తెలియకనే మనమే దానిని తప్పుగా పరిచయం చేస్తున్నాం.  ధర్మాన్ని ప్రేమించండి..  కానీ మూర్ఖత్వాన్ని కాదనే  విషయాన్ని గ్రహించాలి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఆధ్యాత్మిక  నిపుణుల సలహాలతో  పురాణ గ్రంథాల నుంచి సమాచారం సేకరించి..ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.