ఇండిగో సంక్షోభంతో దిగొచ్చిన DGCA.. పైలట్లకు 48 గంటల రెస్ట్ నిబంధన ఉపసంహరణ

ఇండిగో సంక్షోభంతో దిగొచ్చిన DGCA.. పైలట్లకు 48 గంటల రెస్ట్ నిబంధన ఉపసంహరణ

ఇండిగో సంక్షోభంతో డీజీసీఏ దిగొచ్చింది. ఇండిగో విమానాల రద్దుతో పైలట్లకు 48 గంటల రెస్ట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో పాటు  విమాన క్రూ, ఫ్లైట్ రోస్టర్  నిబంధనలు కూడా సడలించింది. 

ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) పేరుతో పైలట్లకు 48 గంటల విశ్రాంతి తప్పని సరిచేసిన విషయం తెలిసిందే. దీంతో పైలట్ల కొరత  ఏర్పడి రెండు రోజులుగా భారీగా విమానాలను రద్దు చేసింది ఇండిగో. దీంతో దేశ వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా విమాన ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో 48 గంటల విశ్రాంతి నిబంధనతో పాటు.. పైలట్లకు వారంపాటు విశ్రాంతి నిబంధనను ఎత్తివేసింది డీజీసీఏ

డీజీసీఏ కొత్త నిబంధనతో ఇండిగో ఆపరేషన్లు కుప్పకూలిన విషయం తెలిసిందే.  దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు కిక్కిరిసిన ప్రయాణికులతో రైల్వేస్టేష న్లను తలపిస్తున్నాయి. 12-14 గంటలుగా నీళ్లు, భోజనం లేక వేచిచూసే ప్రయా ణికులు కోపంతో, బిక్కుబిక్కుమంటూ ఇండిగో కౌంటర్ల ముందు వేచి చూస్తున్నారు. 

►ALSO READ | అసలేం జరుగుతోంది? బహిరంగంగా చెప్పండి: ఇది చిన్న గ్లిచ్ కాదు, నిర్లక్ష్యం: IndiGOపై హీరోయిన్ ఫైర్

ఇండిగో క్రూ కొరత, టెక్ సమస్యలు, కొత్త నైట్ డ్యూటీ నిబంధనలపై తప్పుడు అంచనాలు.. ఇవన్నీ కలిసిపోవడంతో ఆపరేషన్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఎయిర్లైన్స్ అంగీకరించింది. డిసెంబర్ 8 నుంచి ఫ్లైట్ల సంఖ్య తగ్గిస్తూ షెడ్యూల్ స్టబిలైజేషన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. "రెండు రోజులుగా మా నెట్ వర్క్ అంతటా భారీ అంతరాయాలు ఏర్పడ్డాయి. ప్రభావితులైన అందరికీ క్షమాపణలు," అని ఎయిర్లైన్ ప్రకటించింది. అయితే విమానాశ్రయాల్లో ప్రయాణికుల బాధలు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు.