అసలేం జరుగుతోంది? బహిరంగంగా చెప్పండి: ఇది చిన్న గ్లిచ్ కాదు, నిర్లక్ష్యం: IndiGOపై హీరోయిన్ ఫైర్

అసలేం జరుగుతోంది? బహిరంగంగా చెప్పండి: ఇది చిన్న గ్లిచ్ కాదు, నిర్లక్ష్యం: IndiGOపై హీరోయిన్ ఫైర్

మనదేశంలోనే అతిపెద్ద ఎయిర్​లైన్స్​ కంపెనీ అయిన IndiGOలో గందరగోళం కొనసాగుతోంది. సిబ్బంది కొరత కారణంగా బుధ, గురు వారాల్లో పలు విమానాలు రద్దు చేసిన ఇండిగో సంస్థ.. డిసెంబర్ 5నాటికీ పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. దాదాపు 550కిపైగా విమానాలు రద్దవడంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో  ప్రయాణికులు ఎయిర్​పోర్టుల్లో నిరసనలు తెలుపుతున్నారు. అలాగే, విమానాల రద్దులు, ఆలస్యాలపై ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ పోస్ట్లు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై హీరోయిన్ మెహ్రీన్ ఫైర్ అయ్యింది. ‘ ఇది ఏమాత్రం అంగీకారం కాదు. ప్యాసింజర్లు రోజుల తరబడి ఎయిర్ పోర్టుల్లో చిక్కుకుంటున్నరు. ఇదేదో చిన్న గ్లిచ్​కాదు, నిర్లక్ష్యం. కొత్త డీజీసీఏ నిబంధనలు వచ్చినప్పుడే మీ షెడ్యూల్స్ ​సరిచేసుకోవాల్సింది. కస్టమర్లను తప్పుదోవ పట్టించడం కాదు.. మీరు సృష్టించిన గందరగోళం దారుణమైనది. అసలేం జరుగుతోంది? బహిరంగంగా చెప్పండి.. మీ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి పరిహారం చెల్లించండి’ అంటూ డిమాండ్ చేసింది. కాగా.. 550 విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు ఎయిర్​పోర్టుల్లో నిరసనలు  తెలుపుతున్న సంగతి తెలిసిందే.

ఢిల్లీ నుంచి 95,  హైదరాబాద్ నుంచి 68,  ముంబై నుంచి 118, బెంగళూరు నుంచి 73 విమాన సర్వీస్‌‌‌‌లు ఆగిపోయాయి. దీంతో ఎంతో మంది ఎయిర్​పోర్టుల్లోనే చిక్కుకున్నారు. ఎంక్వైరీ కౌంటర్ల వద్ద క్యూలు కనిపించాయి. కొన్ని విమానాలు 10 గంటల వరకు ఆలస్యం అయ్యాయి.

మెహ్రీన్ సినిమాల విషయానికి వస్తే.. నేచురల్​ స్టార్ ​నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస తెలుగు సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది ఈ బ్యూటీ.

శర్వానంద్తో మహానుభావుడు, రవితేజతో రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్3 సినిమాలలో నటించి హిట్స్ అందుకుంది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజులుగా సినీ పరిశ్రమకు దూరంగా అయ్యింది.  ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్న ఈభామ.. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్​తో టచ్​లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తూ అభిమానులను పలకరిస్తుంది.