3 నిమిషాలకు మించి రెడ్​ సిగ్నల్​ పడొద్దు : డీజీపీ జితేందర్‌‌‌‌

3 నిమిషాలకు మించి రెడ్​ సిగ్నల్​ పడొద్దు : డీజీపీ జితేందర్‌‌‌‌
  •     ట్రాఫిక్‌‌ రివ్యూ మీటింగ్‌‌లో డీజీపీ జితేందర్‌‌‌‌
  •     రద్దీ ప్రాంతాల్లో డ్రోన్స్‌‌ వినియోగించాలి
  •     బాడీ వార్న్ కెమెరాలు తప్పనిసరి

హైదరాబాద్‌‌, వెలుగు : సిటీ ట్రాఫిక్‌‌పై డీజీపీ జితేందర్‌‌‌‌ ఫోకస్ పెట్టారు. సిబ్బంది పనితీరు, సిగ్నల్స్, ట్రాఫిక్ మానిటరింగ్‌‌పై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. వాహనాదారులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో డ్రోన్స్‌‌ ఆపరేట్​చేసి, ట్రాఫిక్‌‌ను మానిటరింగ్ చేయాలని సూచించారు. రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలు, ట్రాఫిక్ సమస్యపై శనివారం బంజారాహిల్స్‌‌లోని కమాండ్ అండ్‌‌ కంట్రోల్ సెంటర్‌‌‌‌లోరివ్యూ మీటింగ్ నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు శ్రీనివాసరెడ్డి, అవినాష్ మహంతి సహా రెండు కమిషనరేట్లకు చెందిన ట్రాఫిక్‌‌ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

డీజీపీ మాట్లాడుతూ.. వాహనాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీక్ అవర్స్‌‌లో ట్రాఫిక్ పోలీసులంతా రోడ్లపైకి రావాలన్నారు. ట్రాఫిక్‌‌ మానిటరింగ్‌‌ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాడీ వార్న్‌‌ కెమెరాలతోపాటు డ్రోన్స్‌‌ వినియోగించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచేందుకు మోటార్ వెహికల్ యాక్ట్‌‌ రూల్స్‌‌ పటిష్టంగా అమలు చేయాలన్నారు.

ప్రతి జంక్షన్‌‌లో 3 నిమిషాలకు మించి రెడ్, గ్రీన్​సిగ్నల్స్‌‌ ఉండకూడదని పేర్కొన్నారు. అంబులెన్స్‌‌ సర్సీసెస్‌‌ కోసం ట్రాఫిక్ అప్లికేషన్‌‌ డెవలప్‌‌ చేయాలని తెలిపారు. ఈ–చలాన్స్ ద్వారా ట్రాఫిక్ ఎక్విప్‌‌మెంట్‌‌ కొనుగోలు చేయాలని చెప్పారు. వర్షాకాలం నేపథ్యంలో 4 నెలల పాటు జీహెచ్‌‌ఎంసీతో కలిసి చర్యలు చేపట్టాలని తెలిపారు.