
- క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో డీజీపీ
హైదరాబాద్, వెలుగు: పోలీసులపై ప్రజల్లో మరింత నమ్మకం కలిగించాలని డీజీపీ జితేందర్ అన్నారు. పోలీస్ స్టేషన్లలో జవాబుదారీతనం, పారదర్శకత మెరుగుపరచాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ల పనితీరును ఫీల్డ్‌లో తిరుగుతూ ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. మాదక ద్రవ్యాలు, ఆర్థిక నేరాల కట్టడికి కృషి చేయాలని అన్నారు. బుధవారం డీజీపీ ఆఫీసులో క్రైమ్ రివ్యూ మీటింగ్ జరిగింది.
అడిషనల్ డీజీ, సీఐడీ చీఫ్ చారుసిన్హా నేతృత్వంలో జరిగిన సమావేశంలో అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, అనిల్ కుమార్, శిఖా గోయల్, ఐజీలు రమేశ్, చంద్రశేఖర్ రెడ్డి, రేంజ్ డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు సహా ఎస్పీలు పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నమోదైన కేసులు, ఇన్వెస్టిగేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్రంలో క్రైమ్, లా అండ్ ఆర్డర్, జిల్లాల్లో పోలీసుల పనితీరు, క్రైమ్ రేట్,శిక్షలు, చార్జ్ షీట్లను సకాలంలో దాఖలు చేయడంపై డీజీపీ జితేందర్ పలు సూచనలు చేశారు.